ప్రపంచంలో ఇప్పుడు టిక్ టాక్ ఏ రేంజ్ లో హల్ చల్ చేస్తుందో అందరికీ తెలిసిందే. అయితే కరోనా వల్ల ఇప్పుడు ఈ టిక్ టాక్ మరింత పాపులారిటీ  సంపాదించింది.  ఇంట్లో ఉండి జనాలు టిక్ టాక్ వీడియోలు చేస్తూ తెగ ఎంజాయ్ చేయడమే కాదు.. తమలోని టాలెంట్ మొత్తం ప్రజల ముందు ఉంచుతున్నారు.  అయితే ఈ టిక్ టాక్ వల్ల టాలెంట్ సంగతి దేవుడెరుగు కొన్ని సార్లు ప్రాణాల మీదకు వస్తున్న విషయం తెలిసిందే.  కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ప్రాణా మీదకు తెచ్చుకుంటున్నారు.  తాజాగా కరోనా సోకదరి ఎవరు ఏం చెప్పినా నమ్మేసి ఆ పని చేసేసి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్న ఘటన గురించి వింటున్నాం. అటువంటిదే ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం పల్లమల్లి గ్రామంలో చోటుచేసుకుంది.

 

 ఉమ్మెత్తకాయలు తింటే కరోనా వైరస్ సోకదని ఎవరో చెప్పిన మాటలు విని ఏకంగా ఓ కుటుంబం మొత్తం ఉమ్మెత్తలు కాయలు తిని ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. వివరాల్లోకి వెళితే..  పల్లమల్లి గ్రామంలోని ఓవృద్ధురాలు స్మార్ట్ ఫోన్ ను ఓపెన్ చేసింది. దాంట్లో ఓ టిక్ టాక్ వీడియోను చూసింది. ఈ వీడియోలో ఉమ్మెత్త కాయల్లోని విత్తనాలకు తింటేకరోనా వైరస్ రాదని ఉంది.  అసలే కరోనా భయంతో వణికిపోతున్న ఆ ఫ్యామిలీ నిజంగా అవి తింటే కరోనా రాదన్న మూఢ నమ్మకంతో తమ ఇంటి సమీపంలో ఉన్న ఉమ్మెత్త చెట్ల నుంచి కాయల్ని కోసి ఇంటికి తెచ్చి వాటిని ఎండబెట్టి ఇంటిలోఉన్న నలుగురికి ఇచ్చింది.

 

వాటిని తిన్నవారందరూ అపస్మారకస్థితిలోకి వెళ్లిపోవటంతో ఇది గమనించి వారిని చీమకుర్తి ఆస్పత్రికి తరలించటంతో వైద్యులు వెంటనే వారికి తగిన చికిత్సనందించటంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.    ఇలా ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు.   వీటిని నమ్మిన కొంతమంది ఇదిగో ఇలా ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: