ప్రస్తుతం దేశంలో కరోనా విజృంభిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఇప్పటికే మనం చైనా దేశాన్ని కరోనా కేసులలో మించి పోయాము కూడా. అంతేకాకుండా మహారాష్ట్రలో కరోనా విలయ తాండవం చేస్తుంది. దేశంలో ఆ ఒక్క రాష్ట్రంలోని 25 వేల కేసులు నమోదయ్యాయి అంటే అక్కడి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు మరణాలు కూడా ఆ రాష్ట్రంలో 1000 కి దగ్గరగా చేరింది. 

 

ఇక మన తెలుగు రాష్ట్రాల్లోకి వస్తే చాపకింద నీరులా రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మొన్నటి వరకు తెలంగాణలో కేసులు రోజుకి సింగిల్ డిజిట్ గా నమోదు అవుతుండగా మళ్లీ పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. అలాగే మరో తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో కూడా  2300 కేసులు నమోదయ్యాయి ఇప్పటివరకు.

 

ఇక అసలు విషయానికి వస్తే ghmc పరిధిలో కరోనా కలకలం సృష్టిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో సగానికి పైగా కేసులు ఒక్క ghmc పరిధిలోనే వచ్చాయి. అయితే ఒకే అపార్ట్ మెంటులో 23 మందికి కరోనా సోకినట్టు తెలుస్తోంది. మాదన్నపేటలో ఉంటున్న ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి బర్త్ డే వేడుకలను చేసాడు. ఈ బర్త్ డే వేడుకల్లోనే కరోనా వ్యాప్తి జరిగిందని ghmc అధికారులు గుర్తించారు. అయితే ఈ పార్టీలో ప్రస్తుతం 23 మందికి కరోనా పాజిటివ్ రాగా మరో ఐదుగురి రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. దీనితో అప్రమత్తమైన అధికారులు మాదన్నపేట ఏరియా ఆస్పత్రిలో 4000 మంది నర్సులతో స్క్రీనింగ్ పరీక్షలు చేస్తున్నారు. వారు కలిసిన కాంటాక్టుల వివరాల కోసం గాలిస్తున్నారు. అయితే ఇప్పుడు ఒకే అపార్ట్మెంటులో 23 మందికి కరోనా సోకడం సంచలనంగా మారింది. ఈ సమయంలో ఇలాంటి పార్టీలు చేసుకోవడం మంచిదో చేసుకున్నవారికి తెలియాలి. ఇలాంటివారు మారనంత వరకు మనం ఇబ్బందులు పడుతూనే ఉండాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: