రోజురోజుకి ప్రపంచంలో టెక్నాలజీ మారుతూనే వస్తుంది. అది మానవాళికి కొంతమందికి పనికి వస్తున్న, కొంతమందికి మాత్రం జీవితాలను నాశనం చేస్తుంది. చాలామంది ఈ టెక్నాలజీ వలన పక్కన ఉన్న వారితో మాట్లాడటం మానేసి ప్రపంచంలో ఏ మూలనో ఉన్న వ్యక్తితో సంభాషణ జరుపుతూ మానవ సంబంధాలను రోజురోజుకీ మర్చిపోతున్నారు కూడా. ఇప్పుడు ఇలాంటి సంఘటన ఒకటి మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే...

 

సోషల్ సైట్ అయిన ఫేస్ బుక్ పరిచయం ఆ మహిళ జీవితంలో చిచ్చు పెట్టింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా ధర్మవరంలోని శారదా నగర్ కు చెందిన ఒక మహిళ (23 ) కు పెళ్లి అయ్యి కొడుకు కూడా ఉన్నాడు. ఇకపోతే ఆమెకు ఫేస్ బుక్ లో పురుషోత్తం అనే వ్యక్తితో పరిచయమైంది. వీరి పరిచయం కాస్త వారి వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇంకేముంది సదరు మహిళ తన భర్త, కొడుకును వదిలి పురుషోత్తంతో కలిసి సహజీవనం కొనసాగిస్తోంది. 

 


ఇకపోతే ఇదివరకే పురుషోత్తానికి కూడా వివాహమైంది. అయితే గత కొద్దీ రోజులుగా ఆ మహిళ పెళ్లి చేసుకోవాలని పురుషోత్తం పై ఒత్తిడిని తీసుక వస్తుంది. దాంతో పురుషోత్తం రేపు మాపు అంటూ కాలం గడుపుతున్నాడు. ఇంతలో ఏకంగా పురుషోత్తం తన భార్యతో కలిసి ఉంటున్న ఇంటికి వచ్చింది. ఐకాంతే పురుషోత్తం భార్య పెళ్లి ఎలా చేసుకుంటావంటూ ప్రశ్నించడంతో వాగ్వాదం మొదలైంది. దీనితో పురుషోత్తం, అతని భార్య కలిసి ఆ మహిళను ఇంట్లో నుంచి బయటికి తోసేశారు. ఇక ఇది భరించలేని మహిళ చేయి కోసుకొని ఆత్మహత్యాయత్న ప్రయత్నం చేసింది. ఇది గమనించిన స్థానికులు ఆమెను దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం కాస్త పోలీసులకు తెలియడంతో ఈ ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: