మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి.. అప్పుడే దేశాన్ని కాపాడినట్లు అంటున్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ఎంత ఘోరమైన ప్రభావం చూపిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.  ప్రతిరోజూ మరణాలు.. కేసులతో సతమతమవుతున్నారు ప్రజలు.  అయితే కరోనాకి ఇప్పటి వరకు ఎలాంటి మందు కనుగొనలేక పోయారు.  దాంతో మనల్ని మనం కాపాడుకోవడమే గొప్ప మందు అంటున్నారు.  ఈ నేపథ్యంలో కరోనా నుండి కాపాడుకోవాలంటే ముఖ్యంగా మాస్క్ ధరించాలి.  భౌతిక దూరం పాటిస్తూ.. ఎవరైనా తుమ్మినా.. దగ్గినా చాలా దూరం ఉండటం మంచిది అంటున్నారు.  తమ పరిసర ప్రాంతాల్లో కరోనా లక్షణాలు ఎవరికైనా వెంటే వెంటనే గమనించి ఆసుపత్రుల్లో చేర్పించాలి.

 

ఇప్పుడు ప్రపంచం మొత్తం ఎవరైనా సరే మాస్క్ తప్పని సరి ధరించాల్సిన పరిస్థితి ఏర్పడింది.  ఇక కరోనా వైరస్ కట్టడిలో గల్ఫ్ దేశం ఖతార్, అన్నీ దేశాల కన్నా ఓ రెండాకులు ఎక్కువే చదివినట్టుంది. అందుకే కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. భౌతిక దూరాన్ని పాటించడం, ముఖాలకు మాస్కులను తప్పనిసరిగా ధరించాలని ఆంక్షలు విధించింది. సాధారణంగా సౌదీ ప్రాంతాల్లో ఏ రూల్ అయినా చాలా కఠినంగా ఉంటుంది.. అందుకే ఇక్కడ క్రైమ్ రేట్ చాలా తక్కువ అంటారు.  ఇప్పుడు ముఖాలకు మాస్క్ ధరించడంపై కూడా కఠినంగా వ్యవహరిస్తున్నారు అక్కడి ప్రభుత్వం.

 

ఒక వేళ ముఖానికి మాస్క్ ధరించకుండా బయటకు వస్తే 2 లక్షల రియాల్స్ జరిమానాతో పాటు, మూడేళ్లు జైలుశిక్ష విధించనున్నట్టు ఆ దేశ పౌరులను ప్రభుత్వం హెచ్చరించింది. దీంతో అక్కడి ప్రజలు బయటకు వెళ్తే తప్పనిసరిగా మాస్క్‌లు ధరిస్తున్నారు.  కాగా, 27 లక్షల జనాభా ఉన్న ఖతార్‌లో.. 28 వేల మందికి కరోనా సోకింది. 14 మంది ‌మృత్యువాత పడ్డారు. ఈ సంఖ్య పెరగకూడదని ఖతార్ ప్రభుత్వం అప్రమత్త చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే తాజా నిబంధనను అమలుచేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: