వైయస్ జగన్ సర్కార్ కి ప్రతిపక్షాల కంటే హైకోర్టులోనే ఎక్కువ ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. జగన్ అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా నేపథ్యంలో తీసుకున్న చాలా నిర్ణయాలు న్యాయస్థానంలో విగిపోయాయి. దీంతో చాలా వరకు వైయస్ జగన్ కి ప్రతిపక్షం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి కాదు అని హైకోర్ట్ అనే పరిస్థితికి మారింది. ఇటువంటి పరిస్థితుల్లో  మొన్న ఇంగ్లీష్ మీడియం చదువుల పై అడ్డంకులు జగన్ సర్కార్ కి హైకోర్టులో ఎదురైన సంగతి అందరికీ తెలిసిందే. ఆ విషయంలో ఎలాగైనా పైచేయి సాధించాలని ఇంగ్లీష్ మీడియం విద్యను ప్రతి పేదవాడికి చేరాలని జగన్ ప్రయత్నాలు మొదలు పెట్టడం జరిగింది. ఇటువంటి సమయంలో తాజాగా అమరావతి రాజధాని భూములను పేదల ఇళ్ల స్థలాలకు కేటాయించాలని జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయానికి రాష్ట్ర హైకోర్టులో బ్రేక్ పడింది.

 

జగన్ అధికారంలోకి రావటం తోనే అమరావతి రాజధాని కేంద్రంగా గత ప్రభుత్వం చేసిన మోసాలను వెలుగులోకి తెచ్చారు. మంత్రులతో కమిటీ వేయించి మొత్తం అమరావతి కేంద్రంగా జరిగిన మోసాన్ని ఒక నివేదిక తెప్పించారు. ఈ విషయం నడుస్తూ ఉండగానే రాజధాని మాస్టర్ ప్లాన్ లో మార్పులు చేస్తూ గృహ నిర్మాణ జోన్ (ఆర్-5 జోన్) పై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై నాలుగు వారాలపాటు హైకోర్టు సస్పెండ్ చేసింది. తదుపరి విచారణ జూన్ 17 కు వాయిదా వేసింది.

 

రాజధాని మాస్టర్ ప్లాన్ లో మార్పు చేయాలంటే ప్రజాభిప్రాయ సేకరణ తప్పనిసరి అని పిటిషనర్ వాదించారు. దీంతో పిటిషనర్ తో ఏకీభవిస్తూ హైకోర్టు రైతులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఇటువంటి నేపథ్యంలో ఈ విషయంలో ఎలాగైనా ప్రభుత్వ వాదన గెలిచే విధంగా సరికొత్త పాయింట్ తో ప్రభుత్వం తరుపున వాదించే లాయర్ల విషయంలో మంచి బలమైన లాయర్ నీ దింపడానికి జగన్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: