సాధారణంగా వ్యాపారస్తులు తమ లాభార్జన  కోసం   పనిచేస్తూ ఉంటారు అని చాలా మంది చెబుతుంటారు. ఎంతవస్తే అంత దోచుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు అని అంటుంటారు. వాస్తవంగా అయితే దాదాపుగా అందరి వ్యాపారవేత్తలు.. మానవతా దృక్పథంతో నే ఉంటారు అని అంటున్నారు విశ్లేషకులు.. ఒకవేళ వ్యాపారస్తులు కనుక లాభాపేక్ష   కోసం ఆశించి ఉంటే తమ ఉత్పత్తులను  విదేశాలకు తీసుకెళ్లి అమ్మేసుకునే వారని... ఎందుకంటే అక్కడ భారత్లో చెల్లించిన దానికంటే ఎక్కువ మొత్తంలో చెల్లిస్తారు కాబట్టి  

 

 అయినప్పటికీ మన కోసం ఉత్పత్తి చేస్తారు కాబట్టి వ్యాపారస్తులు మన రీతిలోనే ఆలోచిస్తూ ఉంటారు. అయితే తాజాగా  మారుతి చైర్మన్ ఇచ్చిన స్టేట్ మెంట్ బై విశ్లేషకులు అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఎంతో బాధ్యతగా గొప్పగా అనిపించింది అంటున్నారు. అయితే కరోనా  వైరస్ కారణంగా గత రెండు మూడు నెలల నుంచి వాహనాల ఉత్పత్తి మొత్తం నిలిచిపోయిన విషయం తెలిసిందే. 


 ఈ నేపథ్యంలోనే తమకు జిఎస్టి మినహాయింపులు ఇవ్వాలని...అలా ఇస్తేనే తాము  సంక్షోభం నుంచి బయటపడి  వాహనాల ఉత్పత్తిని చేయగలుగుతాము అంటూ వాహనాల కంపెనీలు  కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇదే సమయంలో  మారుతి కంపెనీ చైర్మన్ భార్గవ్ మాత్రం.. ఇప్పుడే  జిఎస్టి మినహాయింపులు అడగవద్దని  రెండు నెలల వరకు మన ఉత్పత్తులను గాడిలో పెడతానని... ఆ తర్వాత జిఎస్టి మినహాయింపులు అడిగితే బాగుంటుంది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఎంతో బాధ్యతాయుతంగా ఉంది అంటున్నారూ విశ్లేషకులు.దేశ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఒక బాధ్యతాయుతమైన వ్యాపారవేత్తగా స్టేట్మెంట్ ఇచ్చారు అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు విశ్లేషకులు. ప్రస్తుతం ఉత్పత్తి అయిన వాహనాలను  పాత జిఎస్టి లో నే అమ్మకాలు జరిపి... కొత్త ఉత్పత్తుల కోసం మాత్రం జిఎస్టి మినహాయింపు అడగాలని దీని ఉద్దేశ్యం. ,

మరింత సమాచారం తెలుసుకోండి: