జగన్ పార్టీలో ముందు నుండి ఎక్కువగా యువకులకే ప్రాధాన్యతనిస్తూ ఎన్నికల నాటి నుండి పగడ్బందీ వ్యూహాలతో రాజకీయ ఎత్తుగడలు జగన్ వేస్తున్నారు. దాదాపు మంత్రుల్లో గాని పార్టీలో గాని చూసుకుంటే ఎక్కువగా డిగ్రీ పొందిన నేతలే కనపడతారు. అధికారంలోకి వచ్చిన నాటి నుండి పక్కా వ్యూహా లతో ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తూ తన టీం తన చెప్పుచేతల్లో నడుచుకునే నాయకులకు కీలకమైన పదవులు అప్పజెప్పి ఏడాది పరిపాలనలో రాష్ట్రంలో జగన్ అద్భుతమైన పరిపాలన అందించడం జరిగింది. ఎక్కువగా జగన్ రాష్ట్రంలో విశాఖపట్టణం పై ప్రత్యేకమైన ఫోకస్ పెట్టి అక్కడికి రాజధాని తరలించడానికి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ తన కుడి భుజం లాంటి విజయసాయిరెడ్డికి కీలకమైన పగ్గాలు అప్పజెప్పడం జరిగింది. ఈ క్రమంలో అదే రీతిలో తన సూచనలు మరియు ఆదేశాలు తప్పకుండా పాటించే మంత్రి కన్నబాబు కి విశాఖ ప్రభుత్వ ఇన్చార్జి బాధ్యతలు ఇటీవల అప్ప చెప్పినట్లు పార్టీలో టాక్.

 

 

కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో విశాఖ ప్రజలంతా లాక్ డౌన్ పాటిస్తున్న సమయంలో ఉన్నట్టుండి ఎల్జి పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటన ప్రభుత్వాన్ని ప్రజలని ఆందోళనకు గురి చేశాయి. ఇటువంటి సమయంలో ఈ విషయాన్ని డీల్ చేయడంలో జగన్ వెంటవెంటనే నిర్ణయాలు తీసుకుని పరిస్థితిని చాలావరకు అదుపు చేశారు. ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే విశాఖకు చేరుకొని బాధితులకు నష్ట పరిహారం ప్రకటించి మంత్రులను నియమించి పరిస్థితిని అదుపులో వచ్చేవరకూ వాళ్ళని అక్కడే ఉండాలని ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ విషయంలో ఇంచార్జి మంత్రిగా కన్నబాబే విశాఖలో కీలకంగా ఉన్నారు.

 

సీనియర్ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ సైతం ఆయన తరువాతనే ఉంటున్నారు. అధికారులను పరుగులు పెట్టిస్తూ తరచూ సమీక్షలు జరుపుతూ మరో వైపు ముఖ్యమంత్రితో వీడియో సమావేశాల్లో పాల్గోంటూ అనుసంధానంగా కన్నబాబు ఉంటూ వస్తున్నారు. అదే సమయంలో విశాఖలో రెండో రోజు ఘటన జరిగిన తర్వాత కొంతమంది ఆందోళనకారులు ఎల్జీ పాలిమర్స్ కంపెనీ వద్ద హడావిడి చేశారు. ఈ విషయంలో వెంటనే కన్నబాబు స్పందించి ప్రతిపక్షాలు వేసిన ఎత్తుగడ కౌంటర్ వేస్తూ పరిస్థితిని సాధారణ స్థితిలోకి అతి తక్కువ టైమ్ లోనే తీసుకువచ్చారు. ఇదే సమయంలో ఎల్జీ పాలిమర్స్ అనుమతులు ఇవ్వడం వెనుక టిడిపి ప్రభుత్వం ఉన్నదని కన్నబాబు బయటపెట్టి ప్రతిపక్షాలకు దిమ్మతిరిగే షాక్ ఇవ్వడం జరిగింది. అయితే కేంద్రం, దేశం మొత్తం షాక్ అయిన ఈ ఘటన అతి తక్కువ టైమ్ లోనే జగన్ సర్కార్ సాధారణ స్థితిలోకి తీసుకు రావడం జరిగింది. ఈ విషయంలో కన్నబాబు చాలా తెలివిగా వ్యవహరించడంతో జగన్ ఇటీవల ఆయనకి ఫోన్ చేసి మరీ మెచ్చుకున్నట్లు పార్టీలో టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: