40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ని చెడుగుడు ఆడుకుంటున్నాడు జగన్. అధికారంలోకి వచ్చిన నాటి నుండి జగన్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయం అటు టిడిపిని డిఫెన్స్ లో పడేస్తుండగా ఇటు ప్రజలలో మైలేజీని పెంచుతుంది. ఈ నేపథ్యంలో నాలుగున్నర దశాబ్దాల కాలంలో చంద్రబాబు కి ఎప్పుడూ ఎదురుకాని తీవ్ర సంకటమైన పరిస్థితులు ప్రస్తుతం ఎదురవుతున్నాయి అన్నది నిజం. తమ రాజకీయ ప్రయాణంలో అనుభవంలో పావువంతు అనుభవం ఉన్న జగన్ మోహన్ రెడ్డి వేస్తున్న రాజకీయ వ్యూహాలకు బాబుగారి ప్లాన్లు మొత్తం అని అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు వేగవంతమైన పాలన సంస్కరణలతో టిడిపి నాయకులు మరియు చంద్రబాబుకు కుదేలు అయిపోతున్నారు.

 

స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, అటు వైజాగ్ రాజధాని తరలింపు కావచ్చు, ఇటు నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు కావచ్చు, కరోనా నీ కట్టడి కోసం తీసుకున్న కఠిన నిర్ణయాలు కావచ్చు ఏదైనా జగన్ పాలన ప్లాన్లు చంద్రబాబు వ్యూహలకు అందని పరిస్థితి. వాస్తవంగా చూస్తే చంద్రబాబు జగన్ ఏ చిన్న నిర్ణయం తీసుకున్న తప్పు పట్టేందుకు కాచుకుని కూర్చుని ఉన్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అప్పటి నుంచి నేటి వరకు అన్ని సంచలన నిర్ణయలే. అధికంగా దళితుల వర్గాలకు సంబంధించిన ఐదుగురు కి మంత్రి పదవులు ఇవ్వటం నుండి స్టార్ట్ అయిన దూకుడు ఇప్పటికీ చంద్రబాబు కి అర్థం కాని పరిస్థితి.

 

ఇక ఇప్పుడు జగన్ సర్కారు జారీ చేసిన 203 జీవో పై నోరు మెదప లేని దయనీయ స్థితి. మరోవైపు తన రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం జగన్ పొరుగు రాష్ట్ర మిత్రుడైన కెసిఆర్ ని కూడా లెక్క చేయలేనంత అభిప్రాయం ప్రజలలో బలంగా నాటుకుంది. ఈ నిర్ణయంలో ఏపీ లో ఉన్న ప్రతి పక్షాలు జగన్ నిర్ణయానికి తప్పనిసరిగా జై కొట్టాల్సిన పరిస్థితి. ఈ నిర్ణయంతో జగన్ తనకి రాష్ట్ర ప్రయోజనాల కంటే మిత్రుడు ఎవరూ లేరు అన్నది తేటతెల్లం చేశాడు. ఏది ఏమైనా జగన్ దూకుడు నిర్ణయాలకు చంద్రబాబు విలవిలలాడుతున్నట్లు ఏపీ రాజకీయాల్లో టాక్. 

మరింత సమాచారం తెలుసుకోండి: