కరోనా నియంత్రణలో భాగంగా భారత ప్రభుత్వం కీలక నిర్ణయాను తీసుకుంది. ప్రజల వల్ల ఒకరి నుంచి మరొకయిరి వస్తున్నా నేపథ్యంలో ప్రజలు ఎవరు బయట ఎవరు తిరగకూడదనే ఉద్ద్యేశ్యంతో లాక్ డౌన్ ను విధించింది. అందులో భాగంగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇకపోతే ఇంట్లో కూర్చోవడానికి భారత ప్రభుత్వం అంత సంపన్నమైన దేశం కాదన్నా విషయం విదితమే.. రోజు కూలి పని చేసుకుంటేనే ముద్ద నోటి వరకు వెళ్ళదు.

 

 

 

ఇలాంటి విపత్కర పరిస్థితులలో ప్రజలను ఆదుకోవాలని ప్రముఖలు ముందుకు వస్తున్నాయి. సినీ ప్రముఖులు ప్రజలకు కరోనా రాకుండా జాగ్రత్తలు తెలుపుతూ వస్తున్నారు.చాలా మంది ప్రముఖులు ప్రజలకు తోచిన సాయాన్ని అందిస్తూ వస్తున్నారు. ఇప్పటికే చాలా మందికి పేదలకు స్వయంగానో లేదా విరాళాలను అందించో ప్రజల కళ్ళల్లో సంతోషాన్ని నింపుతున్నారు. 

 

 

 

 

ఈ టైంలో ఇళ్లలో ఊరికే ఉండలేని కొందరు తమకు తోచిన వీడియోలు చేసి సోషల్ మీడియా ద్వారా జనాల్లోకి వదిలేస్తున్నారు. వీటిని చూసే కొందరు అమాయలు నిజాలనుకుని నమ్మేసి ప్రయోగాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇటీవలే చిత్తూరు జిల్లాకు చెందిన రెండు కుటుంబాలకు చెందిన 8 మంది ఉమ్మెత్త పువ్వు గింజల ద్రావణం తాగితే కరోనా రాదంటూ కొందరు ఆకతాయిలు చేసిన టిక్‌టాక్ వీడియోను చూసి ప్రయోగం చేసి ప్రాణాల మీదకు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ విషయం పూర్తిగా మరువక ముందే మరొక కొత్త ప్రయోగాన్ని చేశారు.. 

 

 

 

 

 

 

 

 

ఉమ్మెత్తకాయ తింటే కరోనా రాదన్న వీడియోను టిక్‌టాక్‌లో చూసిన ఓ వృద్ధురాలు నిజమేనని నమ్మింది. వెంటనే పొలాల వెంట తిరిగి ఉమ్మెత్తకాయలను సేకరించి ఇంటికి తెచ్చింది. తీరిగ్గా కూర్చుని ఉమ్మెత్తకాయను ఒలిచి విత్తనాలు వేరు చేసింది. ఇవి తింటే కరోనా రాదంటూ కొడుకు, కోడలు, మనవరాలికి తినిపించింది. అనంతరం తాను కూడా తినేసింది.దీంతో తనతో పాటు ఉమ్మెత్తకాయ విత్తనాలు తిన్న ఇంట్లోని మిగిలిన ముగ్గురు కూడా కళ్లు తిరిగి పడిపోవడంతో కేకలు పెట్టింది. వెంటనే ఇరుగుపొరుగు గుమిగూడి విషయం తెలుసుకుని ముక్కున వేలేసుకున్నారు. వారిని ఆసుపత్రిలో చేర్పించారు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: