చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో అమరావతిని రాజధానిగా ప్రకటించి తమ సామాజిక వర్గానికి మేలు చేద్దామని భావించడం జరిగింది. దీనిలో భాగంగానే ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా భూములు బాబు సేకరించినట్లు వార్తలు రావటం మనకందరికీ తెలిసిందే. ఈ విధంగా భూములను రియల్ ఎస్టేట్ చెయ్యాలని బాబు ప్రయత్నించినట్లు ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ లోపు ఎన్నికలు రావడం జగన్ అధికారంలోకి రావడంతో అభివృద్ధి అనేది అంతటా విస్తరించాలని రాజధాని వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో టిడిపి లోని కొంతమంది చంద్రబాబు కి దగ్గరగా ఉండే వాళ్ళు బినామీ లుగా చెప్పబడే వాళ్ళు  ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా భూములు కొనుగోలు చేసినట్లు వైయస్ జగన్ ప్రభుత్వం ఆరోపిస్తోంది.

 

ఇదే సమయంలో మరో పక్క రాజధాని వికేంద్రీకరణ విషయంలో అమరావతిలో శాసన, కర్నూల్ లో న్యాయ రాజధాని అదేవిధంగా దేశంలోనే అత్యధిక వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో ఎగ్జిక్యూటివ్ రాజధాని ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం ప్రకటించింది. అప్పటి నుండి చంద్రబాబు మరియు ఆయన సామాజిక వర్గానికి చెందిన నాయకులు మూడు రాజధానుల కు వ్యతిరేకంగా ఉద్యమాన్ని లేవనెత్తారు. కాగా కరోనా వైరస్ కొమ్ముకాస్తున్నలెక్కచేయని టిడిపి రాజధాని రైతులు గత ఐదు నెలలకు పైగానే అమరావతి రాజధాని నే కొనసాగించాలని ఉద్యమిస్తున్నారు.

 

టిడిపి పక్షపాత పత్రికలు కరోనా ఉద్రిక్తత కొనసాగుతున్న ఉద్యమా వార్తలు లేకుండా ప్రచురించడం లేదంటే అతిశయోక్తి కాదు. ఈ పత్రికలు మీడియా సంస్థలు కూడా ఈ వ్యవహారంలో భారీ లబ్ధి పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి. మొదటి నుండి విశాఖపట్నం నీ రాజధానిగా వ్యతిరేకిస్తున్న టిడిపి ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు మరియు మద్దతుగా ఉండే మీడియా విశాఖపట్నం ఇమేజ్ దెబ్బ తీయడానికి ఎల్జి పాలిమర్స్ విషయాన్ని బేస్ చేసుకుని తెగ కథనాలు ప్రసారం చేస్తున్నాయి. ఏదో రకంగా అమరావతిని మాత్రమే ఏకైక రాజధానిగా ఉంచాలని తమ సామాజికవర్గానికి చెందిన వాళ్లే బాగుపడాలి అన్నట్టుగా వైజాగ్ ని టీడీపీ గట్టిగా టార్గెట్ చేసినట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వినబడుతున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: