తెలంగాణలో గత కొద్దీ రోజుల నుండి భారీగా కరోనా కేసులు  నమోదవుతుండగా శనివారం కూడా అదే ట్రెండ్ కొనసాగింది, నిన్న ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా  55 పాజిటివ్ కేసులు నమోదు కాగా అందులో జిహెచ్ఎంసి లో 44 , రంగారెడ్డి లో 1, సంగారెడ్డి లో 2 నమోదు కాగా 8 వలస కూలీలవని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ కొత్త కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు 1509 కేసులు నమోదు కాగా అందులో 971మంది బాధితులు కోలుకోగా 34 మంది మరణించారు. ప్రస్తుతం 504కేసులు యాక్టీవ్ గా వున్నాయి. 
ఇక  నిన్న దేశ వ్యాప్తంగా  4553 కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం. సింగల్ డే లో ఇప్పటివరకు ఇదే హైయెస్ట్. అందులో అత్యధికంగా మహారాష్ట్ర లో 1606, తమిళనాడు లో 477, ఢిల్లీ స్లో 438, గుజరాత్ లో 348 కేసులు నమోదయ్యాయి. ఓవరాల్ గా దేశ వ్యాప్తంగా  ఇప్పటివరకు 90409 కేసులు నమోదు కాగా అందులో  33928మంది బాధితులు కోలుకోగా 2862 మంది మరణించారు. ప్రస్తుతం 53614 కేసులు యాక్టీవ్ గా వున్నాయి. మరోవైపు నేటితో  దేశ వ్యాప్తంగా  విధించిన  మూడో దశ లాక్ డౌన్ పూర్తి కానుంది అయితే కరోనా ప్రభావం ఏమాత్రం తగ్గకపోవడంతో కేంద్రం మరోసారి లాక్ డౌన్ ను పొడిగించనుంది అందులో భాగంగా మే 18 నుండి  30వరకు  నాలుగో దశ లాక్ డౌన్ అమల్లోకి రానుందని సమాచారం. నేడు దీనిపై స్పష్టత రానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: