తాజాగా దేశ ప్రజలందరినీ ఉద్దేశించి మాట్లాడిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లాక్ డౌన్ 4.0 చాలా విన్నూతంగా ఉండబోతోందని చెప్పిన విషయం తెలిసిందే. అయితే సంక్షోభ సమయంలో దేశం ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులని తట్టుకోవాలంటే దేశ ప్రజలందరూ స్థానికంగా తయారు చేసిన వస్తువులను కొనుక్కోవాలని పిలుపునిచ్చారు. మన దేశం లోని ప్రజలంతా వారికి వారి సొంత కాళ్లపై వాళ్ళు నిలబడి…. తమపై తాము ఆధారపడి బ్రతకాలని మోడీ పిలుపునిచ్చారు.

 

దీనిని ఇప్పుడు అందరూ 'ఆత్మనిర్బర్ఇండియా' 'వోకల్ ఆఫ్ లోకల్' అని పిలుస్తున్నారు కానీ ఇది ఎప్పటి నుండో చైనాలో అమలు చేయబడుతుంది. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన చైనా దేశం దగ్గర వనరులకు ఏమాత్రం కొదవలేదు. ఇక వారికి ఉన్న మేధాసంపత్తిని ఉపయోగించి స్థానికంగా అనేది ఇండస్ట్రీలను ప్రభుత్వమే ఏర్పాటు చేయించి డబ్బున్న వారి చేత పెట్టుబడులు పెట్టించి కార్మికులుగా ఉద్యోగులుగా తమ సొంత దేశస్థులనే తయారు చేసి అంతా తాము అనుకున్నట్లు జరిపిస్తూ ఉంది.

 

చైనాలో దాదాపు అన్ని వస్తువులు వారి దేశంలో తయారు చేయబడినవి. ఏదో అక్కడ వాతావరణం లోని తేడాలు ద్వారా పండని పంటలు మరియు ఇతరత్రా వస్తువులు లేదా ముడి సరుకులు తప్పించి దాదాపు వారు వాడే ప్రతి వస్తువులు దేశంలో తయారు చేయబడినదే. కానీ మన దేశం దగ్గరికి వచ్చేసరికి దాదాపు సింహభాగం వస్తువులను విదేశాల నుండి దిగుమతి చేసుకోవడం ఎక్కువ ధరకు కొనుక్కోవడం.

 

చేదు నిజాన్ని మోడీ చాలా ఆలస్యంగా గ్రహించాడు. ఒక దేశం ఆర్థికంగా అభివృద్ధి చెంది ప్రజలంతా సుసంపన్నంగా ఉండాలంటే ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ సహాయం చేసుకుంటూ క్రమ పద్ధతిలో నడిచే వ్యవస్థను తయారు చేయాల్సిన అవసరం ఉంది.

 

అయితే ఉన్నఫలంగా మోడీజీ ఇటువంటి పిలుపుని ఇవ్వగా అత్యుత్సాహంతో ఎవరైనా లోకల్ ఇన్వెస్టర్లు ప్రభుత్వం మీద నమ్మకంతో పెట్టుబడులు పెడితే చివరికి దేశ ప్రజలంతా మళ్ళీ పరిస్థితి చెక్కబడిన తర్వాత విదేశీ పరికరాలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చే అవకాశం ఉంది. అప్పుడు స్టాక్ మార్కెట్ పూర్తిగా దెబ్బతిని దేశం మరింత నష్టాల్లోకి కోరుకునే పోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రధాని ఇచ్చిన పిలుపును సరిగ్గా అర్థం చేసుకొని దీనికి సంబంధించిన ఒక వ్యవస్థ ఏర్పడిన తర్వాత ఆలోచించి అడుగు ముందుకు వేయడం మంచిది. అప్పటివరకూ మనకు స్థానికంగా తయారయ్యే వస్తువులను కొనుగోలు చేయడం వల్ల దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచినవారవుదాం.

మరింత సమాచారం తెలుసుకోండి: