తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కరోనా తన సత్తా చూపించడం మొదలెట్టింది. టెస్టుల సంఖ్య ఒక్కసారిగా పెంచగానే కేసులు సంఖ్య ఆమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 55 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కొత్తగా వచ్చిన కరోనా పాజిటివ్‌ కేసుల్లో 44  జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

 

దీనితో రాష్ట్ర వ్యాప్తంగా వీటితో మెత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1509 కు చేరింది. ఇకపోతే రోజు‌ 12 మంది డిశ్చార్జ్ కాగా. దీంతో మొత్తం ఇప్పటి వరకూ డిశ్చార్జి అయిన వారి సంఖ్య 971కి చేరింది. ఇక మొత్తం రాష్ట్రంలో ఉన్న యాక్టివ్‌ కేసుల సంఖ్య 504 గా ఉంది. అయితే రోజూ నమోదు అవుతున్న కేసులుల్లో ఒక్క గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలోనే సగటున 95% కన్నా కేసులు నమోదు అవుతుండడం గమనార్హం.

 

కాబట్టి తెలంగాణ ప్రజలు ప్రాంతానికి వెళ్ళకుండా…. అనవసరమైన కాంటాక్ట్స్ జీహెచెంసీ వాసులతో పెట్టుకోకపోవడం మంచిది. ముఖ్యంగా అక్కడ నుండి ఇతర ప్రాంతాలకు వచ్చిన వారిలో కోవిడ్ లక్షాణాలతో అనుమానితంగా ఎవరైనా కనపడితే మంచిది వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వడం ఉత్తమం.

 

హెల్త్ బులెటిన్‌లో వివరాల ప్రకారం.. కరోనా సోకడం వల్ల ప్రభావితమైన కుటుంబాల జాబితాలో హైదరాబాద్‌ తొలి స్థానంలో ఉంది. జీహెచ్ఎంసీ పరిధిలో 168 కుటుంబాలు కరోనా వల్ల ప్రభావితమయ్యాయి. తర్వాతి స్థానంలో రంగారెడ్డి జిల్లా ఉంది. జిల్లాలో 59 కుటుంబాల్లోని కొందరు వ్యక్తులు కరోనా బారిన పడ్డారు. తర్వాత మేడ్చల్ (39), నిజామాబాద్ (30) ఉన్నాయి. ఇప్పటి వరకూ తెలంగాణలో కరోనా వల్ల 34 మంది చనిపోయారు. మరోవైపు, కరోనా సోకిన వలస కార్మికుల సంఖ్య 52 అని బులెటిన్‌లో పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: