కరో‌నా క‌ల‌క‌లం, లాక్ డౌన్ విధించ‌డం వ‌ల్ల క‌లిగిన అనేకానేక స‌మ‌స్య‌ల్లో బైకుతో బ‌య‌ట‌కు వెళ్ల‌లేని ప‌రిస్థితి ఒక‌టి. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో దేశమంతా లాక్ డౌన్ విధించిన నిబంధ‌న‌లు పాటించి అడుగు బ‌య‌ట‌పెట్ట‌ని వారు కొంద‌రైతే. ఏవో సాకులు చెబుతూ రోడ్లపైకి వచ్చిన వాహనదారులు మ‌రికొంద‌రు. అయితే, ఇలా రోడ్డెక్కిన వారికి త‌గు షాక్ త‌గి‌లింది. లాక్ డౌన్ పాటించ‌క రోడ్డెక్కిన‌వారి బండ్ల‌ను సీజ్ చేయ‌గా... ఇప్పటివరకు తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 6 లక్షల వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. వీరి విష‌యంలో..ఓ కీల‌క అప్‌డేట్ తెర‌మీద‌కు వ‌చ్చింది. కొన్ని షరతులతో సీజ్ అయిన వాహనాలను విడిపించుకోవచ్చున‌ని పోలీసులులు తెలిపారు.

 

 

లాక్ డౌన్ స‌మ‌యంలో రోడ్డెక్కిన వాహ‌నాల విష‌యంలో  పోలీసులు రంగప్రవేశం చేసి వాహనదారులకు ఫైన్లు వేసి ఎవరూ రోడ్ల మీదికి రాకుండా చేశారు. అయన‌ప్ప‌టికీ కొంతమంది వాహనాదారులు మాత్రం పోలీసుల మాటను కూడా పెడచెవిన పెట్టి లాక్ డౌన్‌ టైంలో అనవసరంగా రోడ్ల మీదికొచ్చిన వారి వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 6 లక్షల వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. సీజ్ అయిన వాహనాలను విడిపించుకోవడానికి పోలీసులు కొన్ని షరతులు పెట్టారు.

 

లాక్ డౌన్ నిబంధనలను ఉల్లఘించినందుకు ఫైన్ కట్టి, పూచికత్తు సమర్పిస్తే తప్ప బండి విడుదల చేయమని పోలీసులు కండీషన్ పెట్టారు. అలా ఫైన్ కట్టి, పూచికత్తు ఇచ్చిన వారికి ఇప్పటికే వాహనాలను కూడా ఇస్తున్నారు. అయితే మరో వారం రోజుల్లో సీజ్ అయిన వాహనాలకు సంబంధించిన కేసును కోర్టుకు సమర్పించనున్నారు. అయితే ఈ కేసు ఒక్కసారి కోర్టుకు వెళ్లిన తర్వాత.. కోర్టు ఏం చెబితే అలానే వాహనాలను విడుదల చేయవలసి ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. వాహనదారులు లాక్డౌన్ నియమాలను పాటించనందుకు.. కోర్టు వాహనాలను సీజ్ చేయమంటే చేస్తామని; అలాకాకుండా.. ఫైన్ కట్టించుకొని విడుదలచేయమని చెబితే అలాగే చేస్తామని పోలీసులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: