లాక్ డౌన్‌తో మ‌నోళ్ల‌కు కష్టాలు మొద‌లైన సంగ‌తి తెలిసిందే. ఇంట్లో నుంచి అడుగు బ‌య‌ట‌పెట్ట‌లేని ప‌రిస్థితి. ఇలాంటి త‌రుణంలో, రెస్టారెంట్లు, హోటళ్లు టేక్ అవే స్టార్ట్ చేయడంతో మ‌నో‌ళ్ల జోరు కొన‌సాగుతోంది.  కొందామన్నా, తిందామన్నా లాక్ డౌన్తో హోటళ్లు, రెస్టారెంట్లు తీయకపాయె అనుకున్న వాళ్లు థర్డ్ ఫేజ్ లో కేంద్రం ఇచ్చిన సడలింపులతో వాటి రుచి చూస్తున్నారు. హైదరాబాదీ బిర్యానీ లేదు, రంజాన్ మొదలైనా హలీమ్ వాసన తగల్లేదు అనుకుంటూ నిరీక్షించిన వాళ్లు ఇప్పుడు డోర్ డెలివ‌రీల‌తో ఎంజాయ్ చేస్తున్నారు.

 

హైద‌రాబాద్ న‌గ‌రంలో రెస్టారెంట్లు, హోటళ్లు టేక్ అవే స్టార్ట్ చేయడంతో న‌గ‌ర వాసులు తమ ఫెవరేట్ ఫుడ్ లాగిస్తున్నారు. ఉదయం10 నుంచి రాత్రి 7 గంటల వరకు టేక్ అవే సర్వీస్ ఉంటుందని రెస్టారెంట్ నిర్వాహకులు చెప్తున్నారు. హెల్దీ కాంబోలు, సౌత్, నార్త్ ఇండియన్ కాంబో, పరాఠా కాంబో, బిర్యానీ కాంబో వంటి మెన్యూతో టేక్ అవే లిస్ట్ ని రెస్టారెంట్స్ అందుబాటులో ఉంచుతున్నాయి. పిజ్జా, బర్గర్ లవర్స్ కోసం డోమినోస్ లాంటి షాప్స్ ఆర్డర్ తీసుకుని డోర్ డెలివరీ చేస్తున్నాయి. బికనీర్ వాలా, కరాచీ, మినర్వా, క్రీమ్ స్టోన్, హోటల్ మెర్క్యూర్ వంటి ఫేమస్ రెస్టారెంట్స్, హోటల్స్ టేక్ అవే ఇస్తున్నాయి. మాస్క్ లు, శానిటైజర్, ఫిజికల్ డిస్టెన్స్ లాంటి సేఫ్టీ ప్రికాషన్స్ మెయింటెన్ చేస్తున్నట్లు తెలిపారు.

 

హలీమ్‌పై న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు ఉన్న క్రేజ్ని దృష్టిలో పెట్టుకుని ఆదాబ్ ఎక్స్ప్రెస్, స్పైస్ సిక్స్ గ్లోబల్, ఓరిస్, పెషావర్ లాంటి రెస్టారెంట్లు టేక్ అవే అందించేందుకు ముందుకొచ్చాయి. గవర్నమెంట్ రూల్స్ మేరకు హలీమ్ తయారీకి పర్మిషన్ తీసుకున్నాయి. తక్కువ మొత్తంలో తయారుచేసి కస్టమర్లకు అందిస్తున్నాయి. హలీమ్ అమ్ముతున్నట్లు పోస్టర్స్, ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్ లాంటి సోషల్ యాప్స్లో తమ రెస్టారెంట్ పేజ్తో ప్రమోట్ చేసుకుంటున్నాయి. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకే హలీమ్ అమ్ముతున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: