దేశంలో ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతుంది.. అయితే రోడ్లపై గత 45 రోజుల నుంచి వాహనాల రాకపోకలు ఎక్కువగా లేవు.  కేవలం పమిరిషన్ ఉన్నవారే నడిపారు.. గత వారం రోజుల నుంచి వాహనాలు రోడ్లపై తిరుగుతున్నాయి.. అది కూడా పూర్తి స్థాయిలో కాకుండా అత్యవసర పనులపై మాత్రమే.  గతంలో ప్రతిరోజూ రోడ్డు ప్రమాదాలు ఎలా ఉండేవో ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు.  మద్యం సేవించి, అత్యంత వేగంగా వాహనాలు నడపడం.. ఇలా ఎన్నో కారణాల వల్ల ప్రతిరోజూ రోడ్డు ప్రమాదాలు జరుగుతూ వచ్చాయి. కానీ దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి కేసులు తగ్గుతూ వచ్చాయి. కాగా,  దేశవ్యాప్తంగా మార్చి 25 నుంచి లాక్ డౌన్ అమలులోకి రాగా, వీధులు, రహదారులు అన్నీ ఖాళీ అయ్యాయి.

 

రహదారులపై తిరిగే వాహనాల సంఖ్య గణనీయంగా తగ్గిన సమయంలోనూ నిర్లక్ష్యం వందలాది ప్రాణాలను బలిగొంది. దేశవ్యాప్తంగా మే 16 వరకూ 2 వేలకు పైగా ప్రమాదాలు జరిగాయని రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు కృషి చేస్తున్న సేవ్ ‌లైఫ్‌ ఫౌండేషన్ వెల్లడించింది. ఉత్తర ప్రదేశ్ లో మృతుల సంఖ్య అధికంగా ఉందని, రాష్ట్ర పరిధిలో దాదాపు 100 మంది మరణించారని గణాంకాలు విడుదల చేసింది. ఉత్తర్ ప్రదేశ్ తర్వాత యూపీ తరువాత మధ్య ప్రదేశ్ లో 30 మంది, తెలంగాణలో 22 మంది, మహారాష్ట్రలో 19 మంది, పంజాబ్ లో 17 మంది ఉన్నారని, అత్యధిక ప్రమాదాలకు అతివేగం, నిర్లక్ష్యమే కారణమని సేవ్‌ లైఫ్‌ ఫౌండేషన్‌ సీఈవో పీయూష్‌ తివారీ వ్యాఖ్యానించారు. 

 

 అయితే ఈ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా వలస కూలీలను తరలిస్తున్న వారికే జరుతున్నాయి.. అత్యవసరంగా వెళ్లే ప్రయత్నంలో ఇలా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నయని అంటున్నారు.  మరికొన్ని సందర్భాల్లో నిద్రిస్తున్న వారు తమ ప్రమేయం లేకుండానే ప్రమాదాలకు గురి కావడం దిగ్భ్రాంతి కలిగించే అంశమని తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: