కరోనా వైరస్... భారతదేశంలో మొదలైనప్పటి నుంచి తిరుమలలో ఎప్పుడూ లేనివిధంగా భక్తులకు దర్శనం ఆపరేషన్ సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఇంతకుముందు కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర చెప్పినట్లు వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడానికి అన్ని మార్గాలు మూసుకుపోతాయి అని చెప్పినట్లుగా నిజంగా అలాగే జరిగింది ప్రస్తుత పరిస్థితి. దీనితో రోజు రెండు లక్షలకు పైగా దేవుని దర్శించుకుని భక్తులు ఒక్కరు కూడా దర్శించుకోవాలని పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. దీనితో తిరుమల దేవస్థానం కి వచ్చే ఆదాయం కూడా ఏమాత్రమూ లేదు.

 


దీనితో ప్రస్తుతం టిటిడి ఉద్యోగులకు కూడా వచ్చే రెండు నెలల్లో జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా కనిపించట్లేదు. ఇక అసలు విషయానికి వస్తే... మనదేశంలో కరోనా వైరస్ ని అరికట్టడానికి లాక్ డౌన్ పార్టీ ఇస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. దీనితో దేశంలోని ఆలయాల అన్నిటిలో కేవలం పూజలు మాత్రమే స్వామివారికి పూజ నైవేద్యాలు సమర్పిస్తున్నారు. అయితే ఇక కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వెలసిన తిరుమల ఆలయం కూడా ఇలాగే జరిగింది. ఇక దీనితో మే 4వ తారీకు నుంచి దేశంలో లాక్ డౌన్ 3.0 అమలు అవుతున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. అంతేకాదు ఆ ముందురా నుండే శ్రీవారి ఆలయం తెరుచుకునే విషయంపై సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి. 

 


ఇక ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనాలకు ప్రభుత్వం అనుమతి ఇస్తే పలు జాగ్రత్తలతో తిరిగి ప్రారంభించేలా ఆలయ అధికారులు చర్యలు చేపడుతున్నారు. భక్తుల మధ్య భౌతిక దూరం పాటిస్తూ శ్రీవారిని దర్శించుకునేలా క్యూలైన్లలో మార్కింగ్‌ చేస్తున్నారు టీటీడీ అధికారులు. ఒక లడ్డూ కౌంటర్లలో వైట్‌ లైన్స్‌ కూడా ఏర్పాటు చేశారు. శనివారం నాడు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ నుంచి శ్రీవారి ఆలయ మహా ద్వారం వరకు, అలాగే బయోమెట్రిక్‌ ప్రాంతంలోనూ రెడ్‌ లైన్స్‌ ఏర్పాటు చేశారు అధికారులు. భక్తుల మధ్య మూడడుగుల దూరం ఉండేలా ఎర్రటి స్టిక్కర్లను నేలపై అంటించారు టీటీడీ అధికారులు. ఏదిఏమైనా దేవుడిని దర్శనం చేసుకోవడానికి కూడా మనం ఇన్ని ఇబ్బందులు పడవలిసి వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: