ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ప్రభుత్వమే అవకాశం ఇస్తుందా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. హైకోర్ట్ విషయంలో ప్రభుత్వానికి వరుసగా దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఏ కేసు కోర్ట్ కి వెళ్ళినా సరే ప్రభుత్వానికి ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. అమరావతి విషయంలో సహా రాజధాని తరలింపు వంటి కొన్ని విషయాలు ఇప్పుడు జగన్ సర్కార్ కి ఇబ్బంది గా మారాయి. 

 

అమరావతి రాజధాని గా తరలించే విషయంలో కోర్ట్ అడ్డం పడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఇళ్ళ పట్టాల విషయంలో కూడా ప్రభుత్వం చాలా ప్రాంతాల్లో ఇబ్బంది పడే సూచనలే ఉన్నాయి అనేది చాలా మంది మాట. ఇళ్ళ పట్టాలను పంచే సమయంలో ప్రభుత్వం హైకోర్ట్ లో కేసులను ఎదుర్కోవాలని తూర్పు గోదావరి, కృష్ణ గుంటూరు జిల్లాల్లో ప్రభుత్వానికి కచ్చితంగా ఇబ్బందులు రావడం ఖాయమని అంటున్నారు. 

 

ఇక తూర్పు గోదావ‌రి జిల్లాలో చాలా ఖాళీ స్థలాలు ఉన్నాయి. అయితే వీట‌న్నింటిని కాద‌ని ప్ర‌భుత్వం మ‌డ అడ‌వుల‌ను పూడ్చి వేయ‌డం... అక్క‌డ పేద‌ల‌కు ఇళ్ల స్థ‌లాలు ఇస్తామ‌ని చెప్ప‌డం విప‌క్షాల‌కు అన‌వ‌స‌రంగా ఛాన్స్ ఇచ్చిందా ? అన్న సందేహం వ‌స్తోంది. ఈ విష‌యంలో స్థానికంగా ఉన్న మంత్రులు, అధికారులు ఈ నిర్ణ‌యం తీసుకున్నారా ?  వీళ్లు ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లకు ఎందుకు ఛాన్స్ ఇస్తున్నారో కూడా తెలియ‌ని ప‌రిస్థితి.

 

ఇక ఎల్జీ పాలిమర్స్ వ్యవహారం సహా కొన్ని వ్యవహారాలూ న్యాయపరంగా ప్రభుత్వం ఎదుర్కోవడం సవాల్ అని, అంత సులభం కాదని కొందరు అంటున్నారు. హైకోర్ట్ లో చిన్న చిన్న విషయాలు కూడా జగన్ సర్కార్ కి పెనుభూతంగా మారుతున్నాయి. రెవెన్యు శాఖలో కొందరు అధికారులు ఏ నిర్ణయం తీసుకోవాలి అన్నా సరే తాము ఎక్కడ సమాధానం చెప్పాలో అని భయపడే పరిస్థిత ఉంది అని అంటున్నారు. అయితే ఇందులో జ‌గ‌న్ త‌ప్పులు లేక‌పోయినా కొంద‌రు ప్ర‌జా ప్ర‌తినిధులు, అధికారులు చేస్తోన్న చ‌ర్యల వ‌ల్ల అంతిమంగా జ‌గ‌న్‌, ప్ర‌భుత్వంపై ఈ విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయ‌ని చెప్ప‌వ‌చ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: