జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నగరంలో ఉంటూ కరోనా వైరస్ కారణంగా తెలుగువాళ్లు పడుతున్న బాధలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వస్తున్నారు. ఒక పక్క పార్టీ కార్యకర్తలతో నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూనే మరోపక్క లాక్ డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాలలో ప్రాంతాలలో చిక్కుకుపోయిన తెలుగు ప్రజల కోసం తన వంతు కృషి చేస్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన చేస్తూ కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేస్తూ గుజరాత్ రాష్ట్రంలో మత్స్యకారులను వెంటనే ఏపీకి తరలించాలని కోరడం జరిగింది. కేంద్రం ఓకే చేయడం జరిగింది. కాకపోతే ఇక్కడ పవన్ కళ్యాణ్ కంటే ముందుగానే ఏపీ ప్రభుత్వం స్పందించడంతో కేంద్రం కూడా చొరవ తీసుకోవటంతో వెంటనే గుజరాత్ లో చిక్కుకుపోయిన వేలాది మంది మత్స్యకారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సురక్షితంగా చేరారు.

 

ఇటువంటి సమయంలో గల్ఫ్ దేశాలలో చిక్కుకుపోయిన తెలుగు వారి గురించి ఎంపీలు మాట్లాడటం లేదని పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో స్పందించారు. కరోనా సమయంలో బాద్యతలు విస్మరించిన ప్రజా ప్రతినిదుల గురించి ప్రజలకు తెలియచేయాలని అన్నారు. హైదరాబాద్ లో ఉంటూ టెలికాన్పరెన్స్ లు చేస్తున్న పవన్ కళ్యాణ్ ప్రజాప్రతినిదులను విమర్శించడానికి సిద్దం అవుతున్నారు. పండ్ల రైతులు చాలా సమస్యలు ఎదుర్కుంటున్నారని అన్నారు. ఆర్టిసి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించరాదని పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఇతర దేశాలలో చిక్కుకుపోయిన స్వదేశానికి చెందిన వాళ్లని ఎలాగైనా తీసుకురావాలని చాలా గట్టిగా డిమాండ్ చేశారు.

 

విద్యార్థులను మరియు ఉద్యోగస్తులను ఇతర దేశాలలో ఉంటున్న వారి కోసం స్పెషల్ ఫ్లైట్ లు ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వాలు ఈ విషయంలో ఎలా స్పందిస్తుందో చూడాలి. చాలావరకు గల్ఫ్ దేశాలకు రాష్ట్రం నుండి వెళ్లే వాళ్ళు ఎక్కువగా పొట్టకూటికోసం వెళ్ళేవారు. అక్కడ కూలి పనులు చేస్తూ వచ్చే ఆదాయాన్ని ఇక్కడ ఉన్నా కుటుంబాలకు పంపిస్తుంటారు. మరి ఇటువంటి విషయంలో పేద వారు మరియు కూలీలు గల్ఫ్ దేశాలలో చిక్కుకుపోయిన వారికోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎంపీలు పవన్ కళ్యాణ్ చేసిన డిమాండ్ కు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: