రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల విషయం రోజు రోజుకీ ముదురుతోంది. దీనిపై పెద్ద ఎత్తున రాజకీయ రాద్ధాంతాలు రెండు తెలుగు రాష్ట్రాలలో చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ నాయకులు విపక్షంలో ఉన్న నాయకులు ఏపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై మండిపడుతున్నారు. కృష్ణా జలాల లో తమ వాటా నీటిని మాత్రమే తాము వాడుకుంటున్నారు అంటూ ఏపీ ప్రభుత్వం బాధిస్తుంటే లేదు లేదు నిబంధనలకు చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తుందని విమర్శిస్తున్నారు. తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేసే విధంగా ఏపీ ప్రభుత్వం 203 జీవోలు జారీ చేయడం అన్యాయంగా తెలంగాణ నాయకులు పరిగణిస్తున్నారు.

 

ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిధులు కృష్ణా జలాల విషయంలో మొండివైఖరి ప్రదర్శిస్తున్నారు. ఈ వివాదంతో మొన్నటివరకు స్నేహపూరితంగా ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఇప్పటికే కేసీఆర్ సర్కార్ కృష్ణా జలాల వివాదంపై కృష్ణ బోర్డు కు కూడా ఫిర్యాదు చేసింది. దీనిపై ఏపీ ప్రభుత్వ నిర్ణయం ఏంటో చెప్పాలంటూ వివరణ కూడా కోరింది. ఇదే సమయంలో తెలంగాణ బిజెపి నాయకుడు అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 203 జీవోను తప్పు పట్టారు.

 

150 టీఎంసీల నీటిని ఏపీ అదనంగా తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తోందని బండి సంజయ్ విమర్శించారు. ఈ విషయంపై కేంద్ర జలవనరుల శాఖ కు లెటర్ కూడా రాయడం జరిగింది. దీంతో తెలంగాణ నాయకులు వ్యవహరిస్తున్న తీరు ఏపీ సీఎం జగన్ కి కోపం వచ్చినప్పుడు వెంటనే కౌంటర్ ఇవ్వడానికి సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. పూర్తి మేటర్ లోకి వెళ్తే ఈ విషయంలో విభజన చట్టం ఆధారంగా కృష్ణా జలాల ఆధారంగా ఏపీ రాష్ట్రానికి నీటి వాడుక విషయంలో ఎంత హక్కు ఉందో క్లారిటీ ఇచ్చే విధంగా జగన్ అడుగులు వేయబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: