చైనాలోని పుహాన్ లో పుట్టుకొచ్చిన భయంకరమైన వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తుంది.  అమెరికా, ఇటలీ, బ్రిటన్, ఫ్రాన్స్ లాంటి అగ్ర దేశాల్లో ఈ కరోనా మహమ్మారి బీభత్సం సృష్టిస్తుంది.  ఇప్పటివరకు 47,17,038 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కాగా, 3,12,384 మంది మృత్యువాత పడ్డారు. ప్రపంచం మొత్తమ్మీద చికిత్స పొందుతున్న వారి సంఖ్య 25,94,555. ఇక, 18,10,099 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. అత్యధికంగా అమెరికాలో ఈ వైరస్ ధాటికి 89,595 మంది మరణించారు. గత 24 గంటల్లోనే అక్కడ వెయ్యికి పైగా మృతి చెందారు.  ఇక చైనాలో మొదలైన ఈ మాయదారి వైౌరస్ అక్కడ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది.  చైనాకు చెందిన వైద్య, ఆరోగ్య నిపుణులు కరోనా నేపథ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

 

చైనీయుల్లో సహజంగానే వ్యాధి నిరోధక శక్తి తక్కువని, దాంతో కరోనా వైరస్ మరోసారి విజృంభించే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రముఖ వైద్య నిపుణుడు డాక్టర్ జోంగ్ నాన్ షాన్ స్పందిస్తూ, తక్కువ వ్యాధి నిరోధక శక్తి కారణంగా చైనీయులు మళ్లీ కరోనా బారినపడే అవకాశాలు ఎక్కువని అన్నారు.  ఈ మద్య తాము ఆ నమూనాలను నాశనం చేసే నాటికి కోవిడ్‌ వ్యాధికి కారణమయ్యే వైరస్ ‘సార్స్ కోవ్2’ను ఇంకా గుర్తించలేదని, ఆ నమూనాల కారణంగా వైరస్ మరింత మందికి వ్యాపించకుండా ఉండాలనే ఉద్దేశంతోనే వాటిని ధ్వంసం చేయాలని ఆదేశించినట్టు ఎన్‌హెచ్‌సీ‌లోని సైన్స్ అండ్ హెల్త్ విభాగానికి చెందిన ల్యూ డెంగ్‌ఫెంగ్ పేర్కొన్నారు.

 

ప్రస్తుతం చైనా అతిపెద్ద సవాల్ ఎదుర్కొంటోందని, విదేశాలతో పోల్చితే ఇది మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని జోంగ్ నాన్ షాన్ తెలిపారు. ఇప్పుడు అక్కడ కరోనాను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి లేదని, మరోసారి పెను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అధికారులు ఆదమరిచి వ్యవహరించరాదని స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: