భారత దేశంలో రోజురోజుకు కరోనా  వైరస్ కేసుల సంఖ్య పెరిగిపోతున్న  విషయం తెలిసిందే. ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఈ వైరస్ వ్యాప్తి మాత్రం శరవేగంగా జరిగిపోతుంది. ముఖ్యంగా మహారాష్ట్రలో అయితే పరిస్థితి రోజు రోజుకు చేయి దాటిపోతుందని. కేవలం మహారాష్ట్ర ఒక్క రాష్ట్రంలోనే 30 వేలకుపైగా కరోనా కేసులు భారతి కేసు నమోదు కావడం ప్రస్తుతం దేశానికి శాపంగా మారుతోంది. ఇప్పటికే ఈ మహమ్మారి వైరస్ బారిన పడిన వారి సంఖ్య 30 వేలు దాటిపోయింది ఒక మహారాష్ట్రలోనే . కొత్తగా ఏకంగా పదహారు వందలకుపైగా కేసులు నమోదయ్యాయి. 

 

 

 దీంతో మహారాష్ట్ర లోని ప్రజలందరూ ఎక్కడ ఈ ప్రాణాంతకమైన మహమ్మారి  తమపై దాడి చేసి మృత్యువు అంచుల వరకూ తీసుకెళ్తుందోనని  ప్రాణాలను అరచేతిలో పట్టుకుని బిక్కుబిక్కుమంటూ బతుకును వెళ్లదీస్తున్నారు. అటు ప్రభుత్వ అసమర్థత అధికారుల నిర్లక్ష్యమా అనేది  తెలియదు కానీ రోజురోజుకు పెరుగుతున్న కేసుల సంఖ్య మాత్రం పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా మహారాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మే 31 వరకు లాక్ డౌన్ కొనసాగిస్తున్నట్లు  ఉద్ధవ్ ఠాక్రే సర్కార్ ప్రకటించింది.. 

 

 

 ముఖ్యంగా ముంబై నగరంలో అయితే కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. కేవలం ముంబై నగరంలోని శనివారం ఒక్కరోజులోనే 884 కేసులు నమోదు కావడం ఆందోళనకర పరిస్థితులకు దారి తీస్తుంది. ఈ నేపథ్యంలో ఒక పక్క కరోనా  నియంత్రణకు చర్యలు తీసు కుంటూనే మరోవైపు ముంబై కార్పొరేషన్లో కొత్త కంటైన్మెంట్ పాలసీ విధానాన్ని తీసుకురానున్నారు. ఎక్కడైనా కరోనా  కేసులు బయటపడితే ఇంటి చుట్టుపక్కల ప్రాంతాన్ని మొత్తం కంటైన్ మెంట్ జోన్ గా ప్రకటిస్తూ వచ్చారు. కరోనా  బాధితుల ఇంటికి వెళ్లే దారులను ఇనుప కంచెలతో మూసి వేస్తున్నారు. ఇప్పటి వరకు ఇలాంటి చర్యలు చేపట్టగా... ఇక ఇప్పుడు కొత్త విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. బాధితులు ఉన్న ఇల్లు లేదా సదరు అపార్ట్మెంట్ మాత్రమే కంటైన్ మెంట్ జోన్ గా  ప్రకటించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: