కరోనా వైరస్ కారణంగా చనిపోయిన వారి మరణాల సంఖ్యను దాచిపెడుతున్నట్టు తాజాగా ఢిల్లీలో ఢిల్లీ ఆసుపత్రిలో చోటుచేసుకున్న సంఘటన గురించి తెలుసుకుంటే స్పష్టమవుతుంది. కోవిడ్ 19 పాజిటివ్ వచ్చిన 70 ఏళ్ల లారీ ట్రక్ డ్రైవర్ ఢిల్లీలోని రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ మరణించాడు. కానీ అతని మరణ ధృవీకరణ పత్రంలో గుండెపోటు కారణంగా మరణించాడని ఆసుపత్రి వైద్యులు పేర్కొన్నారు. మృతుడు ఢిల్లీలోని ఖజూరి ప్రాంతానికి చెందిన వాడు. ఇతను మే 4వ తారీకు తన తుది శ్వాస విడిచాడు. ఈ 70 ఏళ్ల వృద్ధుడికి కరోనా వైరస్ పాజిటివ్ అని మే రెండవ తేదీన ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో నిర్ధారణ అయ్యింది. కానీ రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి మృతుడి డెత్ సర్టిఫికెట్ లో కరోనా వైరస్ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. కేవలం గుండెపోటు రావడం వలన 70 ఏళ్ల వ్యక్తి చనిపోయాడు అని మరణ ధ్రువీకరణ పత్రం లో రాశారు.


రాజీవ్ గాంధీ ఆస్పత్రి వైద్య సిబ్బంది మీడియాతో మాట్లాడుతూ... 70 ఏళ్ల వ్యాధిగ్రస్తుడు రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి నుండి తమ హాస్పిటల్ కి నాలుగు గంటల పది నిమిషాల ప్రాంతంలో అంబులెన్స్ లో వచ్చాడని... అప్పటికే తాను ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడని... పల్స్ చెక్ చేయడానికి బ్లడ్ ప్రెషర్ చూడడానికి కూడా సమయం లేకుండా పోయిందని... అతడి ప్రాణాలు కాపాడేందుకు అర్ధ గంట పాటు సిపిఆర్ ప్రారంభించామని కానీ అతడిని కాపాడలేకపోయామని... సరిగ్గా నాలుగు గంటల 45 నిమిషాలకు అతడు చనిపోయినట్లు నిర్ధారణ చేసుకొని కుటుంబ సభ్యులకు తెలియపరచాలని చెప్పారు.


అయితే వారు ఇచ్చిన మృతుడి డెత్ సర్టిఫికెట్ లో అతడి మరణానికి హార్ట్ ఫెయిల్యూర్ అని పేర్కొన్నారు డాక్టర్లు. చనిపోయిన ముసలాయన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో లారీ ట్రక్ నడుపుతుంటాడు. 2008వ సంవత్సరంలో ఇతనికి హెచ్ఐవి పాజిటివ్ అని కూడా తేలింది. అతని మరణం గురించి ఎక్కువ విషయాలు తెలుసుకునేందుకు కొంతమంది ప్రయత్నించినప్పటికీ... రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం మాత్రం మాట్లాడేందుకు ముందుకు రాలేదు.

 

ఢిల్లీ ప్రభుత్వం కరోనా వైరస్ కేసుల సంఖ్య దాచిపెడుతుందని ఇప్పటికే ఎన్నో ఆరోపణలు వెల్లువెత్తాయి. 65 ఏళ్ల పైబడిన వారు కరోనా దెబ్బకి మరణిస్తున్నారని నివేదికలో చెబుతున్నాయి. అందులోనూ ఎవరికైతే ఒకటి కంటే ఎక్కువ రోగాలు ఉంటాయో వారికి కరోనా వైరస్ సంక్రమించే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. ప్రస్తుతం చనిపోయిన 70 ఏళ్ల వ్యక్తికి హెచ్ఐవి ఉండటం వలన ఇతనికి కరోనా వైరస్ సోకి ఉంటుందని అనుమాన పడుతున్నారు వైద్య నిపుణులు. ఏదేమైనా ఓ ఆసుపత్రి అతనికి కరోనా వైరస్ సోకిందని రాతపూర్వకంగా తెలియచేసినప్పటికీ... అతని డెత్ సర్టిఫికెట్ లో కరోనా గురించి ప్రస్తావించకపోవడం ఆందోళన చెందాల్సిన విషయమే. అలాగే మృతదేహమును కరోనా ప్రోటోకాల్స్ ప్రకారం హ్యాండిల్ చేశారా లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ గా మిగిలింది. ప్రోటోకాల్ పాటించకపోతే మృతుడి కుటుంబ సభ్యులకు కూడా కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: