చంద్రబాబు టీడీపీకి జాతీయ అధ్యక్షుడు. జాతీయ పార్టీ ఎక్కడ అని అడగవద్దు. ఎందుకంటే ఏపీ రెండుగా ముక్కలైంది. రెండు రాష్ట్రాలు ఉన్నాయి. కాబట్టి బాబు ఎప్పటికీ  జాతీయ ప్రెసిడెంటే. ఇక ఆయన పార్టీకి గత ఏడాది ఎన్నికల్లో కేవలం 23 సీట్లు మాత్రమే వచ్చాయి. పార్టీ దారుణ‌మైన ఓటమి చెందింది. అంత మాత్రం చేత పార్టీని టోటల్ గా  చంద్రబాబు సర్దేస్తారా.

 

అంటే విషయం అది కాదు, చంద్రబాబు గత యాభై రోజులుగా హైదరాబాద్ లో ఉంటున్నారు. ఆయన ఇపుడు ఏపీకి రావాలనుకుంటున్నారు. మోడీ సర్కార్ నాలుగవ విడత లాక్ డౌన్లో భారీ సడలింపులు ప్రకటిస్తుందని అంటున్నారు. అదే కనుక జరిగితే పెట్టే బేడా సర్దుకుని అమరావతి వచ్చేయాలని రెడీ అయిపోతున్నారుట.

 

నిజంగా బాబు రాజకీయ జీవితంలో ఇన్ని రోజులు ఇంట్లో ఉన్నది లేదు. కరోనా కనుక ఇలా సవాల్ చేయకపోతే బాబు ఈ పాటికి ఏపీ అంతా మూడు సార్లు అయినా చుట్టి వచ్చేవారు. అలాంటి తిరిగే కాలుని లాక్ డౌన్ పెట్టి ఒక చోటనే ఉంచేశారు. అయితే తిట్టే నోరును మాత్రం ఏం చేయలేకపొయారు. అదే వేరే సంగతి. ఆయన జూం వీడియో ద్వారా  రోజూ మీడియా మీటింగులు పెడుతూ వైసీపీని అల్లల్లాడించేస్తున్నారు.

 

మరో వైపు చూసుకుంటే బాబు రాక ఏపీలోని  తమ్ముళ్ళు కూడా నిండా నైరాశ్యంలో పడ్డారు. పార్టీ కూడా పడకేసింది. ఈ నేపధ్యంలో  హైదరాబాద్ లో తానుంటే ఇక పార్టీ పూర్తిగా  లేవదని బాబుకు కూడా డౌట్  వచ్చేసినట్లుగా ఉంది. ఎంత తొందరగా సడలింపులు ఇస్తే అదే వేగంగా అమరావతి వచ్చి వాలిపోవాలని బాబు చూస్తున్నారుట. మరి ఈ నెలలో మహానాడు కూడా ఉంది. దానికి బాబు ఏం చేస్తారో చూడాలి. మొత్తానికి బాబు ఏపీకి వచ్చేస్తే  రాజకీయం మరింతగా వేడెక్కిపోవడం ఖాయం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: