పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటు తెలంగాణలో కూడా ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాలలో తన పార్టీ ఉంటుందని తెలుగు ప్రజల కోసం మీ పార్టీ పెట్టినట్లు పవన్ కళ్యాణ్ అప్పట్లో చెప్పు కు రావడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో కుదిపేస్తున్న పోతిరెడ్డిపాడు నీటి ప్రాజెక్టు విషయంలో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏమీ మాట్లాడక పోవటం తెలుగు రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. బిజెపి పార్టీ తో ఇటీవల పవన్ కళ్యాణ్ చేతులు కలపటం, కలసి పని చేస్తున్నట్లు తెలపటం అందరికీ తెలిసిందే. ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతానికి ఎంతో మేలు చేకూరే 'పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు' నిర్ణయంపై ఏపీ బీజేపీ పూర్తి మద్దతు ప్రకటించడం జరిగింది.

 

కానీ ఈ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ తన నిర్ణయం ఏంటో చెప్పకపోవడం రాయలసీమ వాసులకు విస్మయానికి గురిచేస్తోంది. గతంలో చాలాసార్లు పలు రాజకీయ వేదికలో రాయలసీమపై పవన్ కళ్యాణ్  తనకున్న ప్రేమను చాటారు. రాయలసీమ అభివృద్ధి చెందితే తానెంతో ఆనంద పడతాను... రాయలసీమ ప్రాంతాన్ని వెనకబడే విధంగా చేసింది ఇక్కడ రాజకీయ నేతలే అంటూ తీవ్ర స్థాయిలో రాయలసీమ పొలిటికల్ లీడర్ లపై పవన్ విమర్శలు చేశారు. అయితే ఇటువంటి సందర్భంలో రాయలసీమకు ఎంతో మేలు చేసే పోతిరెడ్డి ప్రాజెక్టు విషయంలో తాను ఏ విధంగా స్పందించినా, ఒక రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకోవాల్సి వస్తుందని ఈ విషయంలో పవన్ వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది.

 

పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీళ్లు అందిస్తే, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా తాగునీటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉండదు. ఇదిలా ఉంటే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టే విషయం కాబట్టి ఈ విషయంలో పవన్ కళ్యాణ్ స్పందించటం లేదని మరోపక్క వార్తలు వస్తున్నాయి. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఏపీ బీజేపీ తో కలసి పని చేస్తున్నారు కాబట్టి వారి నిర్ణయమే తమ నిర్ణయం అన్నట్టుగా ప్లాన్ చేస్తున్నట్లు టాక్. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య గొడవలు సృష్టించే విధంగా ఈ అంశం ఉండటంతో పవన్ కళ్యాణ్ సున్నితంగా వ్యవహరించాలని అనుకుంటున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: