విశాఖలో మత్తు డాక్టర్ సుధాకర్ చేసిన గలాటా ఇపుడు ఏపీవ్యాప్తంగా సంచలనం స్రుష్టిస్తోంది. మత్తు డాక్టర్ని ఏప్రిల్ నెలలో వైసీపీ సర్కార్ సస్పెండ్ చేసింది. ఆయన  వైద్యులకు మాస్కులు ఏపీ సర్కార్ ఇవ్వలేదని అంటూ ఏకంగా జగన్  ప్రభుత్వం మీద రాజకీయ విమర్శలు చేశారని సస్పెండ్ చేశారు. 

 

ఇదిలా ఉంటే నాడు సస్పెండ్ అయిన మత్తు డాక్టర్ విశాఖలో నిన్న సాయంత్రం దర్శనమిచ్చారు. ఆయన విశాఖ వీదుల్లో తాగుతూ అసభ్యంగా ప్రవర్తించారని  పోలీసుల అభియోగం. తనను పోలీసులు దాడి చేసి పిచ్చివాడిగా చిత్రీకరించారని మత్తు డాక్టర్ ప్రత్యారోపణ. ఈ నేపధ్యంలో దళిత కార్డు తీసి ఏపీలో టీడీపీ రాజకీయ రచ్చ మొదలెట్టేసింది.

 

దళితులను వైసీపీ సర్కార్ అవమానించిందని తమ్ముళ్ళు గగ్గోలు పెట్టారు. ఇవన్నీ ఇలా ఉంటే మత్తు డాక్టర్ విషయంలో టీడీపీ ఇంతలా వెనకేసుకురావడానికి ఆయన టీడీపీ అభిమాని అని నర్శీపట్నం  వైసీపీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ అంటున్నారు. మత్తు డాక్టర్ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి సన్నిహితుడని కూడా చెబుతున్నారు.

 

ఆయన 2019 ఎన్నికలలో టీడీపీ తరఫున పోటీ చేసేందుకు టికెట్ కోసం దరఖాస్తు చేశారని కూడా అంటున్నారు. ఆయన తన ఉద్యోగానికి రాజీనామా కూడా ప్రకటించారని చెబుతున్నారు. అయితే టికెట్ రాకపోవడంతో వైద్య విధాన పరిషత్ ఆయన రాజీనామాను ఆమోదించలేదని కూడా పెట్ల ఉమాశంకర్ అంటున్నారు.

 

ఇవన్నీ ఇలా ఉంటే జగన్ని టార్గెట్ గా చేసుకుని మత్తు డాక్టర్ చేస్తున్న  కామెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి. ఆయన నిన్న గలాటా చేసిన సదర్భంగా కూడా జగన్ని దారుణంగా తిట్టారని పోలీసులు చెబుతున్నారు. ముఖ్యమంత్రిని అలా బహిరంగంగా నిందించడం కూడా నేరమేనని అంటున్నారు.

 

ఇక ఆయనకు మతిస్థిమితంలేదని డాక్టర్లు ఆయన్ని మానసిక వైద్య శాలకు తరలించారు. మొత్తం మీద మత్తు డాక్టర్ ని అడ్డం పెట్టుకుని టీడీపీ విష రాజకీయకు తెరతీస్తోందని వైసీపీ ఎమ్మెల్యే ఉమా శంకర్ అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: