లాక్‌డౌన్‌పై  జ‌నాల అభిప్రాయం ఎలా ఉందో తెలుసా..!

 
మోదీ ప్ర‌భుత్వానికి క‌రోనా అనేక సవాళ్లు విసురుతూనే ఉంది. అటు పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌ ఎత్తేసి ప్రజల ప్రాణాలతో చెలగాడమాడే పరిస్థితి లేదు. అలా అని ఇంకా కొన‌సాగిస్తూ ఆకలిచావులకు, పేద‌రికం పెంపున‌కు, నిరుద్యోగం ప్ర‌బ‌లేందుకు మ‌న‌సు అంగీక‌రించ‌ని ప‌రిస్థితి. నాలుగో దశ లాక్‌డౌన్‌కు ప్రజలు సిద్ధంగా ఉండాలని, అయితే ఈ దశ లాక్‌డౌన్ మాత్రం సరికొత్తగా ఉంటుందని ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించిన సమయంలో స్పష్టం చేశారు. ఆయ‌న వ్యాఖ్య‌ల‌తో అంద‌రూ ఊహించిన‌ట్లుగానే నాలుగో దశ లాక్‌డౌన్ కొన‌సాగింపున‌కే కేంద్ర ప్ర‌భుత్వం మొగ్గుచూపింది. 

 

అయితే లాక్‌డౌన్ విష‌యంలో చాలా వ‌ర‌కు స‌డ‌లింపులు ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది.  నిబంధనలపై కేంద్ర హోంశాఖ ఆదివారం రాత్రికి  మార్గదర్శకాలను విడుదల చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. రెండ్రోజులుగా అర్ధరాత్రి మూడు గంటల వరకు కూడా అమిత్‌షా నాలుగోదశ నిబంధనలపై మార్గదర్శకాలను రూపొందిస్తున్నట్లు సమాచారం.  ఇప్పటికే అన్ని రాష్ట్రాలు కూడా తమ తమ సలహాలు, సూచనలను ఇప్పటికే కేంద్రానికి సూచించిన విష‌యం తెలిసిందే. రాష్ట్రాల అభిప్రాయాల‌ను కూడా కేంద్రం పరిగణనలోకి తీసుకొనే తుది నిర్ణ‌యం, మార్గ‌ద‌ర్శ‌కాల అమ‌లుకు ఆదేశివ్వ‌నుంద‌ని తెలుస్తోంది.

 

నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌కు డిమాండ్ పెరుగుతుండ‌గా...ఇత‌ర వినియోగ వ‌స్తువుల ధ‌ర‌ల‌కు డిమాండ్ ప‌డిపోతోంది. ఈ క్ర‌మంలోనే వివిధ రంగాల‌కు చెందిన ప‌రిశ్ర‌మ‌లు మూత‌ప‌డే ప‌రిస్థితికి చేరుకున్నాయి. కేంద్రం ప్ర‌క‌టించిన రూ.20ల‌క్ష‌ల కోట్ల ప్యాకేజీపై విప‌క్షాలు విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డుతున్నాయి. ఆశ‌, దోశ‌, అప్ప‌డం, వ‌డ అన్నట్లుగా కేంద్రం ఊరించి... ఊసురు మ‌నిపించింద‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.ఈ పరిస్థితుల్లో మోదీ తీసుకునే నిర్ణయంవైపే అందరిచూపూ ఉంది. ప్రజల ఆరోగ్యం కాపాడుతూనే… ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన బాధ్యత ఉంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: