కళ్ళు మూసి తెరిచేలోపు ఎన్నో జరిగిపోతూ ఉంటాయి. నిజానికి మరణం ఎటువైపు సంభవిస్తుందో చెప్పలేం. కొంతమంది నిజానికి ఎలా చనిపోయాడు అన్న సంగతి ప్రపంచానికి తెలియడానికి కూడా చాలా రోజులు పడుతుంది. అలాంటి సంఘటన ఒకటి ఇప్పుడు అమెరికాలో జరిగింది. అమెరికా దేశంలోని టెక్సాస్ రాష్ట్రంలో  ఫ్రెడ్డీ మ్యాక్ వ్యక్తి జీవిస్తున్నాడు. ఇకపోతే ఈయన గత రెండు నెలల నుంచి కనిపించడం లేదట. దీంతో అనుమానం వచ్చిన వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు అందించారు. దానితో వారు ఆ కేసు విచారణను కాస్త ముమ్మరం చేశారు. 


ఈ కేసుకు సంబంధించి పోలీసులు భయంకరమైన నిజాన్ని కనుక్కోవడం జరిగింది. సదరు వ్యక్తి మిస్ అయిన విషయం అప్పటివరకు ఒక ఒక మిస్టరీ కేసులాగే ఉండేది. మొదట ఈ కేసు విచారణ సందర్భంగా పోలీసులు వ్యక్తి నివసిస్తున్న నివాసానికి వెళ్లారు. అయితే అక్కడ ఫ్రెడ్డీ మ్యాక్ తన ఇంట్లో 18 కుక్కలను పెంచి పోషించేవాడు. ఇక ఆ కుక్కలు పోలీసులను ఇంట్లోకి రానివ్వకుండా చేయడం జరిగింది. దీంతో విసిగిపోయిన పోలీసులు ఆ కుక్కలకు మత్తుమందు ఇచ్చి ఆ తర్వాత అవి స్పృహ కోల్పోయాక వారు ఇంట్లోకి వెళ్లి శోధన చేశారు.


ఇక దాంతో పోలీసులకు కొన్ని ఎండిపోయిన రక్తపు మరకలు కనుగొన్నారు. అంతేకాకుండా ఆ ఇంట్లో ఉన్న కుక్కల విసర్జనను పరిశీలించగా వెంట్రుకలు, దుస్తులు, ఎముకలు అందులో కనిపించాయి. పోలీసులకు అనుమానం రావడంతో వాటిని డిఎన్ఏ పరిశీలనకు పంపారు. అయితే ఆ రిపోర్టు వచ్చిన పోలీసులకు దిమ్మ తిరిగే షాక్ తగిలింది. అదేమిటంటే వారు పంపించిన మూత్ర విసర్జనలో ఉన్నవి ఆ వ్యక్తి యొక్క శరీర భాగాలు అని తెలిసింది. దీనితో అతను చనిపోవడానికి తన పెంచుకున్న కుక్కలు కారణమని అమెరికా పోలీసులు నిర్ధారణకు వచ్చి ఆ కేసును మూసి వేయడం జరిగింది. అయితే ఆ కుక్కలు ఎవరిని ఇంట్లోకి అడుగు పెట్టనిచ్చేవి కాదని, చివరకు అతని బంధువులు కూడా వారి ఇంటికి వెళ్లాలంటే చాలా భయపడేవారు అని స్థానికులు కూడా ఆ విషయాన్ని నిర్ధారించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: