ఎల్ జీ పాలిమర్. ఈ పేరు వింటేనే జనం గుండెల్లో దడ పుడుతోంది. ఐదు గ్రామాల ప్రజలకు ఉలిక్కిపడుతున్నారు.   స్టైరీన్ విషవాయువు దెబ్బ నుండి ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. అయితే ప్రాణానికే ప్రమాదమైన ఆ కంపెనీని దూరంగా తరలించాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.   

 

ఎల్ జీ పాలిమర్ కంపెనీ చేసిన తప్పులు వరుసగా వెలుగులోకి వస్తుండటంతో ప్రజలు కన్నెర్ర జేస్తున్నారు. ప్రమాదం సంభవించినప్పుడు స్టైరీన్ డై ఆక్సైడ్ ఒక్కటే విడుదల కాలేదని....ఇతర రసాయనాలు, వాయువులు బయటకు వచ్చాయనే నిజాలు బయటికి వచ్చాయి. నిపుణుల అంచనా ప్రకారం స్టైరీన్ ప్రమాదకరమైన రసాయనం కాదు. అది ఆక్సిజన్ తో కలిసినప్పుడు డై ఆక్సైడ్ గా మారి విషవాయువుగా మారుతుంది. అయితే  ఎల్జీ కంపెనీ నుంచి వచ్చిన వాయువుల వల్ల ప్రాణాలు పోవడంతో పాటు అక్కడి ప్రజలకు, జంతువులకు ఒంటిపై కాలిన గాయాలు అయ్యాయి. 

 

ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీ చుట్టుపక్కల ప్రభావిత గ్రామాలు ఏడు వున్నాయి. వీటిలో 3,500 ఇళ్లున్నాయి. 7800 మంది ఉంటున్నారు. ఈ ప్రాంతంలో  స్టైరిన్ విష వాయువు లీక్ అయిన ఘటనలో 12 మంది చనిపోగా, వందల మంది ఆసుపత్రి పాలయ్యారు. ప్రమాదకర వాయువుల తీవ్రత పరిధి ఐదు కిలోమీటర్ల వరకూ విస్తరించింది. దీంతో ఎల్జీ పాలిమర్ కంపెనీ తమ గుండెల్లో కుంపటిగానే భావిస్తున్నారు స్ధానికులు. బాధితులకు భరో సా కల్పించి ఇళ్ళకు చేర్చడంలో ప్రభుత్వం సక్సెస్ అయింది. అయినా వాళ్ళలో భయం తగ్గలేదు. గ్రామాల్లో సాధారణ స్ధాయిని తీసుకువచ్చినప్పటికీ పరిశ్రమను తరలించి తీరాల్సిందేని జనం పట్టుబడుతున్నారు.

 

ప్రమాదం తీవ్రతను గుర్తించిన ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. పాలిమర్ కంపెనీకి ముడిపదార్ధమైన స్టైరీన్ నిల్వలను దక్షిణ కొరియాకు తిప్పి పంపింది. తదుపరి ఆదేశాలు వెలువడే వరకూ పరిశ్రమను మూసి వేయాలని ఆదేశించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: