సోషల్ మీడియా వచ్చినప్పటి నుండి ఏం చేయా లని అనుకున్న కూడా ఇట్లే తెలిసి పోతుంది.. ప్రపంచం లో జరిగిన అన్నీ వార్తలు ఇక్కడ ఇట్టే తెలిసి పోతున్నాయి..అసలు విషయాని కొస్తే..సోషల్ మీడియా లో ఒక వీడియో పోస్ట్ చేశాడని ఓ వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు..వివరాల్లోకి వెళితే.. మందు పార్టీ చేసుకుంటున్న వీడియోను అందరికీ తెలిసేలా ట్విటర్‌ లో పోస్ట్ చేశాడన్న కోపం తో యువకుడి ని తుపాకీ తో కాల్చేశారు దుండగులు. ఇంటికి వెళ్తున్న యువకుడి పై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన యువకుడు ప్రాణాల తో పోరాడుతున్నాడు. ఈ దారుణ ఘటన యూపీ లో జరిగింది.



 

 

మీరట్ జిల్లా సప్నవత్ గ్రామాని కి చెందిన మోహిత్ రానా పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. అతి సమీపం నుంచి తుపాకీ తో కాల్పడం తో కడుపు లో నుంచి బుల్లెట్లు దూసుకెళ్లాయి. ప్రస్తుతం రానా చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది... ఆ వీడియోలో అందరూ తనని చూసి హేళన చేస్తారేమో అని భయంతో అతను అలా చేశాడని తెలుస్తుంది..



 

 

రానా గ్రామ సర్పంచ్ భర్త సతేంద్ర సింగ్, పంచాయతీ సెక్రటరీ, సింగ్ అనుచరులు మందు పార్టీ చేసుకుంటున్న వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. లాక్‌డౌన్ వంటి విపత్కర సమయంలో నిరుపేదలకు సాయం చేయాల్సిందిపోయి తాగితందనాలు ఆడుతున్నారంటూ తీవ్ర విమర్శలు చేశాడు. ట్విటర్‌లో పోస్ట్ చేసిన వీడియో వైరల్ కావడంతో మందుబాబుల బాగోతం అందరికీ తెలిసిపోయింది.అందరూ ప్రభుత్వ ఉన్నతాధికారులు కావడంతో అంతా వైరల్ అయింది..

మరింత సమాచారం తెలుసుకోండి: