ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసిన వినపడుతున్న పేరు కరోనా వైరస్. ఈ వైరస్ గత నాలుగు నెలల నుండి ప్రపంచ నాయకులను ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూనే ఉంది. చైనా దేశంలో పుట్టిన ఈ వైరస్ కి మందు లేకపోవటంతో ఒకరి నుండి ఒకరికి చాలా త్వరగా వ్యాప్తి చెందడంతో పాటు 14 రోజుల వరకూ వైరస్ సోకిందని గుర్తించని రూపంలో ఉండటంతో చాలా ప్రమాదకరంగా ఉంది. దీంతో చాలా వరకు ఒకరి నుండి ఒకరికి వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్ వల్ల ప్రాణ నష్టంతో పాటు ఆర్ధిక నష్టం కూడా ప్రపంచ దేశాలు చూస్తున్నాయి. మందులేని ఈ వైరస్ ని ఎదుర్కోవటానికి ప్రపంచ దేశాలు చాలావరకు లాక్ డౌన్ ప్రకటిస్తున్న తరుణంలో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఏర్పడింది.

 


ఇటువంటి నేపథ్యంలో వైరస్ రోజురోజుకి విస్తరిస్తున్న తరుణం లో ప్రతి ఒక్కరూ మాస్క్‌ని వినియోగించాలని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. దీని వల్ల కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టొచ్చని చెబుతున్నారు. అందుకే మాస్క్ లేకుండా ఎవ‌రైనా బ‌య‌ట‌కు వ‌స్తే.. వారిపై అధికారులు కఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇదే విషయాన్ని చెబుతోంది మాస్క్ ధరించాలని సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని అప్పుడే వైరస్ ని దరికి చేరకుండా చూసుకోవడం జరుగుతుందని చెప్పుకోవటం జరిగింది.

 


అయితే మాస్కులు మేము పెట్టుకోము అని పురుషులు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా అంటున్నారట. చాలా శాడిజం గా  " కరోనా వచ్చినా పర్లేదు మాస్క్ లు పెట్టుకోము .. " అంటున్నారు.  కొన్ని అంతర్జాతీయ యూనివర్సిటీలకు చెందిన సంస్థలు ఈ విషయాన్ని చెబుతున్నాయి ..  మాస్కులు ధరించడానికి చాలామంది పురుషులు అయిష్టత చూపుతున్నారని ఈ సర్వేలో బయటపడింది. స్త్రీలు మాత్రం మార్పులు మాస్కులు ధరించే విషయంలో ప్రభుత్వాలు చెప్పే సూచనలను చాలా తూచా తప్పకుండా పాటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: