ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు తీవ్ర స్థాయిలో పెరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే.. లాక్ డౌన్ ఒకవైపు కఠిన తరంగా మారినా కూడా కరోనా ప్రభావం రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది..కరోనా కారణంగా బాధపడుతున్న పేదలను ఆదుకోవడానికి స్వంచంధ సంస్థలు ముందుకొస్తున్నాయి.. దాంతో పాటుగా సినీ రాజకీయ ప్రముఖులు అభిమానుల కూడా ఎక్కడిక్కడ అన్నదాన కార్యక్రమాలు చేస్తూ పేదల జీవితాల్లో వెలుగులు కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు.. 

 

 

 

 

భారత దేశ ఐకమత్యాన్ని చాటుకుంటూ కుల మతాలకు అతీతంగా పేదలకు  సాయం చేయడంలో ముందుకొస్తూ మరో సారి భారత దేశం సకల మత సమ్మేళనం అని నిరూపించింది .. మే 3 వరకు లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉంటూ కరోనా సోకకుండా జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు.. ప్రజల్లో కరోనా పై అవగాహన కల్పించడానికి సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా ను వేదికగా తెలియ పరుస్తున్నారు.. 

 

 

 

 

అయినా కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి తప్ప ఎక్కడా తగ్గిన సూచనలు కనిపించలేదు.. ఇక అమెరికాలో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో 1,568 మంది కరోనా కాటుకు బలయ్యారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 78,746కు పెరిగినట్టు జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ తెలిపింది.

 

 

 

అలాగే, 13,09,164 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో దాదాపు మూడున్నర లక్షల కేసులు ఒక్క న్యూయార్క్‌లోనే నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. అలాగే, 26,771 మంది  ఇక్కడ ప్రాణాలు కోల్పోయారు. న్యూయార్క్ తర్వాతి స్థానంలో న్యూజెర్సీ ఉంది. న్యూయార్క్ తర్వాత అత్యధిక కేసులు నమోదైంది ఇక్కడే. ఇప్పటి వరకు ఇక్కడ 1,38,579 కేసులు నమోదు కాగా, 9,118 మంది ప్రాణాలు కోల్పోయారు.చాలా మందికరొన లక్షణాలతో పోరాడుతున్నారు.. ఇప్పుడు మరొక కొత్త కేసులు నమోదు అయ్యాయని తెలుస్తుంది..దీంతో ట్రంప్ కీలక నిర్ణయాన్ని తీసుకున్నాడు.. ఇతర దేశాల వాళ్ళను టెస్ట్ చేసి వారి దేశాలకు పంపించాలని నిర్ణయించారు..

మరింత సమాచారం తెలుసుకోండి: