ప్రపంచంలో కరోనా మహమ్మారి ప్రతిరోజూ విజృంభిస్తుంది.  భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి, మరణాల సంఖ్య భారీగా పెరిగిపోతు న్నాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 4,987 మందికి కొత్తగా కరోనా సోకింది. ఇప్పటివరకు దేశంలో ఒక్క రోజులో నమోదయిన కేసుల్లో ఇదే గరిష్ఠం. దేశంలో 124 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య మొత్తం 2,872కి చేరింది. అలాగే, కరోనా నుంచి 34,109 మంది కోలుకున్నారు. ఆసుపత్రుల్లో 53,946  మంది చికిత్స పొందుతున్నారు. దేశంలో కేరళాలో కరోనా కేసులు తక్కువగా ఉన్నాయని భావిస్తున్న సందర్భంలో ఓ బేకరీ యజమానికి కరోనా సోకడం కలకలం రేపుతోంది.

 

దీంతో అతని బేకరీకి వచ్చే సుమారు 1000 మందికి కరోనా అంటించాడేమోనని అధికారులు అప్రమత్త చర్యలు చేపట్టారు.  ఇడుక్కిలో బేకరీ యజమాని(39)కి కరోనా సోకినట్లు అధికారులు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు జిల్లాలోని రెండు గ్రామ పంచాయతీలను కంటైన్‌మెంట్ జోన్లుగా మార్చారు.  ఈ మద్య లాక్ డౌన్ విషయంలెో సడలింపులు రావడంతో జనాలు రోడ్లపై విస్తారంగా తిరుగుతున్నారు.  అంతే కాదు సోషల్ డిస్టెన్స్ ఏమాత్రం పాటించడ లేదు. దాంతో కరోనా కేసులు మరింత పెరిగిపోతున్నాయి. 

 

ఆ బేకరీ యజమానిని పుట్టాడి ప్రాంతంలోని తాలూకా ఆసుపత్రిలో చేర్పించారు. అతని భార్య, పిల్లలను క్వారంటైన్‌కు తరలించారు. అతను ఎవరెవరిని కలిశాడు అన్న కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు.  అతనితో కనీసం 1000 మంది సంప్రదింపులు జరిపారని తెలుస్తోంది. లాక్‌డౌన్‌లో సడలింపుల కారణంగా బేకరీ తెరిచి ఉంచాడు. దీంతో ప్రతిరోజూ వందలాది మంది కస్టమర్లు బేకరీకి వచ్చారు.  ప్రస్తుతం అతనిని ఎవరు కలిశారు.. వారిని అధికారులు ఆ బేకరీకి వచ్చిన కష్టమర్లను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: