దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరగడం ప్రజలను ఆందోళన కలిగిస్తోంది. దీంతో లాక్‌డౌన్ అనివార్యమైంది. కేసుల రీత్యా దఫాల వారిగా లాక్‌డౌన్‌ను  కేంద్రం పొడిగిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా లాక్‌డౌన్‌ను మరోసారి పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా మే 31 వరకు లాక్‌డౌన్‌ను కొనసాగించాలని జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (ఎన్‌డీఎమ్‌ఏ) మే 17 (ఆదివారం) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సడలింపులతో కూడిన నూతన మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేసింది. 

 

కొత్త మార్గదర్శకాలు :

-అన్ని రాష్ట్రాలు సరుకు రవాణా వాహనాలను అనుమతించాలి. 
-రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కఠినమైన రీతిలో కర్ఫ్యూ అమల్లో ఉంటుంది.
- ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల మధ్య సమన్వయంతో అంతర్రాష్ట్ర రవాణా జరుపుకోవచ్చు.
- రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలో ఆయా ప్రభుత్వాల నిర్ణయం ఆధారంగా రవాణా సేవలు నిర్వహించుకోవచ్చు.
-దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలు చేయడం వీలుకాదు. అయితే ఎయిర్ అంబులెన్స్ సేవలు, భద్రతా పరమైన కారణాల కోసం, అత్యవసర వైద్య సేవల కోసం, కేంద్ర -హోంమంత్రిత్వ శాఖ అనుమతితో విమాన ప్రయాణాలు చేయవచ్చు.
-మెట్రో రైళ్లపై నిషేధం కొనసాగుతుంది.
-ఆహార పదార్థాలు హోమ్ డెలివరీ చేసేందుకు రెస్టారెంట్లకు అనుమతి.
-కంటైన్మెంట్ జోన్లలో మాత్రం కేవలం  నిత్యావసరాల కోసమే అనుమతులు ఉంటాయి.
-సినిమా హాళ్లు, మ్యూజియంలు, షాపింగ్ మాల్స్, జిమ్ లు, స్విమ్మింగ్ పూల్స్, వినోద కేంద్రాలు, పార్కులు, డ్రామా థియేటర్లు, బార్లు, ఆడిటోరియంలు, సమావేశ స్థలాలపై నిషేధం కొనసాగుతుంది.
-క్రీడా సముదాయాలు, స్టేడియంలను ప్రేక్షకులను అనుమతించకుండా తెరుచుకోవచ్చు.
-సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, విద్యా, సాంస్కృతిక, మత, అన్ని రకాల వేడుకలు, గుమికూడడాలపై నిషేధం అమల్లో ఉంటుంది.
-అన్ని మతపరమైన ప్రదేశాలు, ప్రార్థనామందిరాలు మూసివేయాల్సిందే. మతపరమైన కార్యక్రమాల కోసం గుమికూడడం నియమోల్లంఘన కిందకు వస్తుంది.
-స్కూళ్లు, కాలేజీలు, ఇతర విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లు మూసివేత కొనసాగుతుంది.
-ఆన్ లైన్ విద్యాబోధన, దూరవిద్య బోధన కొనసాగించవచ్చు.
-హోటళ్లు, రెస్టారెంట్ల మూసివేత కొనసాగుతుంది. అయితే హోటళ్లను, లాడ్జీలను వైద్య, ఆరోగ్య, పోలీసు సిబ్బందికి కేటాయించినట్టయితే వాటిని తెరవొచ్చు.
-బస్ డిపోలు, రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్టుల్లో ఉండే క్యాంటీన్లకు అనుమతి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: