ప్రపంచ ప్రజలను వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం అంతర్జాతీయంగా పేరొందిన శాస్త్రవేత్తలు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. ఇదే సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా వ్యాక్సిన్ కి సంబంధించి అప్డేట్ ఎప్పటికప్పుడు బయట ప్రపంచానికి సమాచారం అందిస్తూనే ఉంది. కచ్చితంగా ఈ వైరస్ నుండి బయటపడాలంటే వ్యాక్సిన్ ఒకటే మార్గమని అప్పటివరకూ కష్టాలు తప్పవని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. వ్యాక్సిన్ రాకపోతే  కరోనా వైరస్ తో కలసి బతకాల్సిందే అని వేరే మార్గం లేదని ఇటీవల చెప్పటం మనకందరికీ తెలిసినదే. ఇదిలా ఉండగా లండన్ లో ఆక్సఫర్డ్ యూనివర్సిటీ కి చెందిన అభివృద్ధి చేస్తున్న hAdOx1 nCoV-19 వ్యాక్సిన్ కోతులపై సత్ఫలితాలు ఇవ్వడంతో ఇప్పుడు అందరి దృష్టి దానిపై పడింది.

 

అస్ట్రాజెనెకా ఫార్మా కంపెనీతో కలిసి ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ల్యాబ్‌లో జెన్నర్ ఇన్‌స్టిట్యూట్ ఈ వ్యాక్సిన్ ను రూపొందిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ పై జరుగుతున్న అన్ని పరిశోధనలలో ముందు నుండి ఆక్సఫర్డ్ యూనివర్సిటీ చేస్తున్న పరిశోధనల పై స్పెషల్ ఫోకస్ అందరికీ ఏర్పడింది. ఫస్ట్ నుండి చాలా వరకు సక్సెస్ ఫుల్ ఫలితాలు వస్తున్న తరుణంలో అన్నిటి కంటే ముందే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో కరోనా వైరస్ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ముందే చాలామంది ఊహించారు.

 

అందరూ ఊహించినట్టే ఫలితాలు వస్తున్నాయి. ఇటువంటి నేపథ్యంలో త్వరలో మార్కెట్ లోకి ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సామాన్యులు కొనే ధరకే తక్కువ రేట్ కి వ్యాక్సిన్ అందుబాటులోకి తెస్తున్న ట్లు పరిశోధనలు జరుపుతున్న శాస్త్రవేత్తల్లో ఒకరైనా  ప్రొఫెసర్ అడ్రియన్ హిల్ ధరపై కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే మనుషులపై ప్రయోగం జరపబోతున్నట్లు సక్సెస్ అయితే వ్యాక్సిన్‌కు సంబంధించిన 10 లక్షల డోసులు తక్కువ ధరకే రిలీజ్ చేయబోతున్నట్లు ఆక్సఫర్డ్ శాస్త్రవేత్తలు వెల్లడించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: