ముందు నుంచి రాయలసీమ ప్రజలు చాలావరకు ముక్కుసూటి వ్యవహారం అన్నట్టుగానే వ్యవహరిస్తారు. మంచి చేసిన వారిని తల ఎక్కించుకుంటారు చెడు చేస్తే ఏమాత్రం సహకరించకుండా వారి స్టైల్ లో తీర్పు ఇస్తారు. రాయలసీమ రాజకీయాలు గమనిస్తే ముందు నుంచి ఎక్కడ ఎక్కువగా చంద్రబాబు ని పెద్దగా పట్టించుకున్న దాఖలాలు ఎప్పుడూ కనబడవు. అప్పట్లో ఎన్టీఆర్ మొహం చూసి ఓట్లు వేసిన గాని తర్వాత వైఎస్ అధికారంలోకి వచ్చాక చాలావరకూ కరువు సీమ గా ఉండే రాయలసీమను రతనాలసీమ గా మార్చడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాయలసీమ చాలా వరకు అభివృద్ధి చెందింది.

 

దీంతో వైయస్ రాజశేఖర్ రెడ్డి చేసిన మంచినీ మనసులో పెట్టుకుని రాయలసీమ ప్రజలు జగన్ ని ముందు నుంచి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ఇదే సమయంలో పలు రాజకీయ పార్టీల నాయకులు కూడా రాయలసీమ ప్రాంతంలో పర్యటించి రాయలసీమ అభివృద్ధి చేస్తామని అంత చేస్తామని, ఇంత చేస్తామని వరాలు దంచేస్తూ వేదికలపై భారీ ప్రసంగాలు చేయడం జరిగింది. అయితే పనితనానికి వచ్చేసరికి ఎవరు కూడా ఎక్కువగా రాయలసీమను పట్టించుకోలేదు. గత ప్రభుత్వం చంద్రబాబు హయాంలో ఇదే విషయం బయటపడింది. వైయస్ హయాంలో దాదాపు కంప్లీట్ అయిపోయిన ప్రాజెక్టులు చంద్రబాబు వచ్చి ఓపెనింగ్ చేసి నానా హడావిడి చేశారు తప్ప రాయలసీమకు పెద్దగా చేసింది ఏమీ లేదు. దీంతో తర్వాత 2019 ఎన్నికల్లో రాయలసీమ ప్రజలు చంద్రబాబును చిత్తుగా ఓడించారు.

 

మరోపక్క రాయలసీమ  రతనాల సీమ  ఈ ప్రాంతమంతా నష్టపోవడానికి కారణం రాయలసీమ నాయకులు అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెగ ప్రసంగాలు చేశారు. రాయలసీమలో కరువు రాజకీయ నాయకులు సృష్టించారని అస్సలు కరువు సీమ లో లేదని ప్రజలను రెచ్చగొట్టే విధంగా అప్పట్లో పవన్ కళ్యాణ్ తన పర్యటనలో చేశారు. అటువంటిది ప్రస్తుతం రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే 'పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు' విషయంలో పవన్ కళ్యాణ్ మరియు చంద్రబాబు నోరు మెదపకుండా ఉండటంతో వాళ్ళిద్దరూ రాయలసీమ ద్రోహులు అంటూ రాయలసీమ ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. సీమ ప్రాంతానికి ఎంతో మంచి చేసే ఈ ప్రాజెక్టు విషయంలో జగన్ ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ తన మద్దతు తెలపాలని రాయలసీమ వాసులు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: