తెలంగాణ లో కరోనా ప్రభావం ఏమాత్రం తగ్గడం లేదు ఈ రోజు కొత్తగా 42 కేసులు నమోదుకాగా అందులో  జిహెచ్ఎంసి లో 33 ,రంగారెడ్డి లో 2 కేసులు అలాగే మరో 3 వలస కూలీలవని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. ఈ కేసులతో కలిపి  రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1551కు చేరగా అందులో 992 మంది కోలుకోగా 34మంది మరణించారు. ప్రస్తుతం 525 కేసులు యాక్టీవ్ గా వున్నాయి. ఇక రేపు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ భేటీ జరుగనుంది. లాక్ డౌన్ 4లో కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలపై ఈ భేటీ లో చర్చించనున్నారు అలాగే కేంద్రం ఇచ్చిన మినహాయింపులను కూడా అమలు చేస్తారో లేదో రేపు క్లారిటీ రానుంది. 
ఇదిలావుంటే దేశ వ్యాప్తంగా ఈరోజు తో మూడో దశ లాక్ డౌన్ ముగియనుండగా రేపటి నుండి  నాలుగో దశ లాక్ డౌన్ అమలులోకి రానుంది. మే 31 వరకు ఈ లాక్ డౌన్ కొనసాగనుంది. అయితే తెలంగాణ లో మాత్రం ముందుగానే  మే 29వరకు లాక్ డౌన్ పొడించగా తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో అక్కడ కూడా 31వరకు లాక్ డౌన్ కొనసాగనుంది. మరోవైపు దేశంలో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ ఒక్క రోజే దేశ వ్యాప్తంగా 5000 కు పైగా పాజిటివ్  కేసులు నమోదయ్యాయని సమాచారం. ఒక్క మహారాష్ట్ర లోనే ఈరోజు 2347 కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: