ప్రస్తుతం కరోనా  కష్టకాలంలో ఎక్కువ శ్రమిస్తున్నది.. ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలను కాపాడుతున్నది.. విధి నిర్వహణలో ప్రాణం సైతం లెక్క చెయకుండా పని చేస్తుంది. వైద్యులు, హెల్త్ వర్కర్స్ అన్న విషయం తెలిసిందే. కరోనా వైరస్  మహమ్మారి తో డైరెక్టుగా పోరాడుతున్నారు వీరూ . ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో వీరు చేస్తున్న త్యాగం మరువలేనిది. ఈ సమయంలో డెంటిస్ట్ డాక్టర్లు కొంతమంది కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. 

 


డెంటిస్ట్  డాక్టర్లుకు కూడా  కరోనా  డ్యూటీ వేస్తున్నారు. కరోనా  డ్యూటీ చేయడానికి కూడా తమకేమీ ఇబ్బంది లేదని.. కానీ తమకు ఒక్క రూపాయి కూడా పే  చేయడం లేదు అంటూ చెబుతున్నారు. తాము డెంటిస్ట్ లము అయ్యుండి ఈస్ స్వాప్  చేస్తున్నామని.. కనీసం డెంటిస్టులు అయ్యుండి ఇలా చేసినందుకు తమకు కొంత పర్సంటేజ్ పాయింట్ యాడ్ చేసి  ఇవ్వచ్చు కదా అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు డెంటిస్టులు. ప్రస్తుతం ఈ లాక్ డౌన్  పీరియడ్ లో డెంటిస్ట్ డాక్టర్ లు అందరూ తమ క్లినిక్స్ అన్ని మూసివేసిన  పరిస్థితి వచ్చింది. 

 

 ఎందుకంటే హైరిస్క్ ఉన్నది డెంటిస్టులకే  కాబట్టి. ఎందుకంటే ప్రస్తుతం కరోనా  వైరస్ వ్యాప్తి చెందుతుంది ఎక్కువగా మనిషి తుంపర్ల ద్వారా అనే విషయం తెలిసిందే. అందువల్ల అది ఎక్కువగా వ్యాప్తి చెందే మొట్టమొదటి వ్యక్తి డెంటిస్టులు  అని చెప్పాలి. అందుకే తమ క్లినిక్ నిర్వహించేందుకు సిద్ధపడడం లేదు డెంటిస్టులు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రధానమైనటువంటి బీడీఎస్ చేసినప్పటికీ కూడా కేవలం ఎనిమిది వేల నుంచి పది వేలు మాత్రమే జీతాలు వస్తున్నాయని.. అందుకే హైరిస్క్ ఉన్న డెంటిస్టులు విషయంలో కూడా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కూడా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే బాగుంటుంది అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: