కరోనా నియంత్రణలో భాగంగా భారత ప్రభుత్వం కీలక నిర్ణయాను తీసుకుంది. ప్రజల వల్ల ఒకరి నుంచి మరొకయిరి వస్తున్నా నేపథ్యంలో ప్రజలు ఎవరు బయట ఎవరు తిరగకూడదనే ఉద్ద్యేశ్యంతో లాక్ డౌన్ ను విధించింది. అందులో భాగంగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇకపోతే ఇంట్లో కూర్చోవడానికి భారత ప్రభుత్వం అంత సంపన్నమైన దేశం కాదన్నా విషయం విదితమే.. రోజు కూలి పని చేసుకుంటేనే ముద్ద నోటి వరకు వెళ్ళదు.

 

 

 

 

 

 

ఇలాంటి పరిస్థితుల నుంచి ప్రజలను కొంతవరకైనా కాపాడేందుకు ప్రభుత్వం చిరు వ్యాపారాలు చేసుకొనేందుకు అనుమతి ఇచ్చింది.. దీంతో ప్రజలు సంతోషంగా ఉన్నారు.. ఇకపోతే ఇక్కడ ప్రస్తుతం ఏ వస్తువును చూసిన కూడా రెట్లు మండి పోతున్నాయి.. ఎది చేసుకొని తినాలన్న కూడా తినలేకున్నరు.. ఇది ఇలా ఉండగా చికెన్ తింటే కరోనా రాదని తెలంగాణ సర్కారు తేల్చి చెప్పడంతో ఇంక ప్రజలు చికెన్ కొనుగోలు మీద పడ్డారు.. 

 

 

 

 

వినియోగదారులు ఎక్కువ అవ్వడంతో గతంలో ఏ వేసవిలోనూ వినియోగదారులు ఎరగనంతగా  కిలో చికెన్‌ ధర రెండు రోజుల క్రితం రూ.257కు చేరుకుని ఆల్‌టైమ్ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ధర మరింత పెరిగిపోయింది. హైదరాబాద్‌లో ప్రస్తుతం కిలో చికెన్‌ ధర రూ.290 పలుకుతుంది. ఆదివారం చికెన్ కొందామని మార్కెట్లోకి వచ్చిన ప్రజలు ధరల గురించి తెలుసుకుని విస్మయానికి గురవుతున్నారు.

 

 

 

 

 

వేసవిలో ఈ స్థాయిలో రేట్లు పెరగడం ఇదే తొలిసారని చికెన్ వ్యాపారులు తెలిపారు. అంతేకాదు, రాబోయే రోజుల్లో చికెన్  ధర‌ మరింత పెరిగే అవకాశం ఉంటుందని చెప్పారు. కరోనా నేపథ్యంలో వచ్చిన వదంతుల కారణంగా కొన్ని రోజుల క్రితం వరకు కోడి మాంసం ముట్టేందుకు బెదిరిపోయిన ప్రజలు ఇప్పుడు భారీగా ఎగబడుతున్నారు. కరోనా భయంతో నెల రోజుల క్రితం ఎన్నడూ లేనంతగా తగ్గిన చికెన్ ధరలు ప్రస్తుతం మండిపోతున్నాయి. అసలే సంపాదన లేక పోవటంతో ఇప్పుడు ప్రజలు చికెన్ ధరలు విని గగ్గోలు పెడుతున్నారు...

 

మరింత సమాచారం తెలుసుకోండి: