ఇన్ని రోజులు లోకంలో కరోనా ఉన్నా ఇంట్లో ఉండి స్వేచ్చగా ఊపిరి తీసుకున్నాము.. కానీ ఇక ముందు పరిస్దితులు అలా ఉండేలా కనిపించడం లేవు.. ఎందుకంటే లాక్‌డౌన్ ముగించ వలసిన సమయం వచ్చింది.. ఇకనుండి ఎవరి ప్రాణాలకు ఎవరు బాధ్యులు కారు.. ఎవరి కుటుంబంలో కరోనా వచ్చిన ఇదివరకటిలా హడావుడి ఉండదు.. ఈ పరిస్దితుల్లో ఇప్పుడు ప్రపంచం ముందున్న అతిపెద్ద సవాల్.. ప్రజలందరు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ, వీలైనంతగా జాగ్రత్తగా జీవించడం అలవాటు చేసుకోవాలి.. మరి ఇది సాధ్యమా అంటే అసలే మనుషులు కోతి నుండి వచ్చారని చెబుతారు.. కాబట్టి ఇది అసాధ్యం..

 

 

ఇకపోతే రాబోయే రోజుల్లో దాదాపుగా లోకం కరోనా పేషంట్లతో నిండిపోయిన ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు.. ఇందుకు ఉదాహరణగా దక్షిణ కొరియా చెప్పవచ్చూ.. కరోనా వ్యాపిస్తున్న సమయంలో ఏ దేశం సాధించని ఘనతను దక్షిణ కొరియా సాధించిన విషయం తెలిసిందే. ఇక్కడి ప్రభుత్వం కరోనా విషయంలో ఎంతో తెలివిగా ప్రవర్తించి ఈ వైరస్ ముప్పును అరికట్టుకుంది.. ఇక అంతా బాగుందని భావించిన దక్షిణ కొరియాలో లాక్‌డౌన్‌ను కూడా ఎత్తివేయడంతో, అన్ని రకాల వ్యాపార కార్యకలాపాలు మొదలయ్యాయి. ఇక ప్రజలు ఆగుతారా ఇన్ని రోజులు ఇంట్లో ఉన్నారు కదా.. కాస్త రిలాక్స్ కోసమని నైట్ క్లబ్ కు వెళ్ళారట.. అదే వారి కొంప ముంచింది..

 

 

ఆ నైట్ క్లబ్ లోకి కరోనా సోకిన వ్యక్తి వెళ్లడంతో.. అతడి నుంచి వైరస్ వ్యాప్తి మళ్ళీ మొదలైంది. ఇలా ఇప్పటివరకు ఆ ఒక్క వ్యక్తి కారణంగా 168 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో అత్యధికులు 20ల నుంచి 30ల వయసున్న వారేనని అధికారులు తెలిపారు.. చూశారా సాధ్యమైనంత వరకు ప్రజలు గుంపులు గుంపులుగా ఉండటానికి ప్రయత్నించకండని అధికారులు మొత్తుకుంటున్న వినకుండా నైట్ క్లబ్ లు, పబ్బులంటు వెళ్లితే అక్కడ కరోనా ఉండదని గ్యారంటీ లేదు.. ఇది జస్ట్ షాంపిల్ మాత్రమే.. అసలు సినిమా మన ఇండియాలో రాబోయే రోజుల్లో మొదలవుతుందంటున్నారు.. కాబట్టి అప్పుడు ఎదుర్కొనె పరిస్దితులను ఊహించుకోండి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: