లోకంలో కరోనా కరువు అప్పుడే మొదలైంది.. అసలే మద్యం ధరలు ఆకాశానికి చేరగా.. మందులోకి మంచింగ్ నావెజ్ గురువు అనుకునే వారికి, కోడి లెగ్ పీసుతో కోలుకోలేని విధంగా షాటిచ్చారు మాంసం దుకాణదారులు.. ఇక ఈ వైరస్ మూలంగా గత కొన్ని నెలలుగా చికెన్ విక్రయాలు భారీగా తగ్గిపోయాయి.. ఒకగానొక దశలో కోళ్లను ఉచితంగా పంచారు కూడా.. ఇలాంటి సమయంలో లాక్‌డౌన్ ముగియడంతో విక్రయాలు పెరిగాయి.. దీంతో ఎన్నడూ లేనంతగా కోడి మాంసం ధరలు అమాంతం పెరిగాయి. ఇకపోతే గతంలో వేసవిలో ఎన్నడూ రూ. 250 దాటని చికెన్‌ స్కిన్‌లెస్‌ ధర ప్రస్తుతం కిలో రూ. 276కు చేరడం ఆల్‌టైమ్‌ రికార్డ్‌గా పౌల్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

 

 

అదీగాకుండా ప్రస్తుతం రంజాన్‌ మాసం కావడంతో కిలో రూ. 300 దాటే అవకాశం ఉందని వ్యాపారులు పేర్కొంటున్నారు. అదీగాకుండా ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌ నెలల్లో పౌల్ట్రీ పరిశ్రమ కరోనా కారణంగా తీవ్రంగా నష్టపోయింది. దీంతో రాష్ట్రంలో కోళ్ల పెంపకం 50 శాతానికి పడిపోవడమే కాకుండా, ఎండ తీవ్రత పెరిగి కోళ్లు తక్కువ బరువు వస్తున్నాయి. ప్రస్తుతం డిమాండ్‌ పెరిగి సప్లయ్‌ చాల తగ్గింది.. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో చికెన్ ధరలకు రెక్కలు వచ్చాయి. అక్కడ నిన్న మొన్నటి వరకు కిలో రూ.80 ఉన్న చికెన్ ధర ఒక్కసారిగా 300 రూపాయలకు చేరుకుంది..

 

 

ఇకపోతే కరోనా వైరస్ పుంజుకుంటున్న సమయంలో ఉచితంగా ఇచ్చిన, తక్కువ రేటుకు ఇచ్చిన ఎగబడి చికెన్ తీసుకున్న ప్రజలు ఇప్పుడు ధరలు పెంచగానే లబోదిబో మంటున్నారు.. ఇక చికెన్ లేనిదే ముద్దదిగని మాంసం ప్రియులకైతే ఈ పెరిగిన ధరలతో మందు కిక్కు కూడా ఎక్కడం లేదట.. ఒక చికెన్ రేటుకే ఇలా విల విలలాడితే రాబోయే రోజుల్లో దేని రేటు ఎంత నిర్ణయిస్తారో, ఇంకా ఏవేవి ధరలు పెరగవలసి ఉన్నవో అని మధ్యతరగతి వారు బిక్కుబిక్కు మంటు బిక్క ముఖం వేసుకుని బేలగా చూస్తున్నారట.. ఏది ఏమైన ఇప్పుడున్న పరిస్దితుల్లో ఒకవైపు కరోనాను తట్టుకుని నిలబడాలి, పెరుగుతున్న ధర వల్ల కడుపులు చంపుకుని బ్రతకాలి.. పేదవారికి ఇది శాపమే మరి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: