దేశంలో ఓ వైపు కరోనా వైరస్ బీభత్సం సృష్టిస్తుంది.  ఈ సమయంలో మనిషిని మనిషి తాకాలంటేనే భయపడిపోతున్నారు.  సామాజిక దూరం, మాస్క్ ధరించాలని ఆంక్షలు విధించారు.  ఇక లాక్ డౌన్ కారణంగా జనసంచారం పూర్తిగా తగ్గిపోయింది. ప్రస్తుతం కొన్నివిషయాల్లో సడలింపుతు జారీ చేస్తున్నారు. అయితే లాక్ డౌన్ కారణంగా క్రైమ్ రేట్ పూర్తిగా తగ్గిపోయిందని పోలీసులు అంటున్నారు. కానీ కొంత మంది కామాంధులు మాత్రం ఇంకా రెచ్చిపోతూనే ఉన్నారు.  దోపిడీలు, లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా ప్రకాశం జిల్లా దొనకొండలో దారుణం జరిగింది. గుప్త నిధుల పేరుతో బాలికపై ఓ యువకుడు పలుమార్లు అత్యాచారానికి తెగబడ్డాడు. గుంటూరు జిల్లా మాచవరానికి చెందిన విష్ణువర్ధన్ రోగాలు నయం చేసేందుకు తాయెత్తులు కట్టి రోజగాలు, భూత వైద్యం చేస్తుంటాడు.

 

ఇలా ఆయనకు ఒకరోజు రుద్రసముద్రానికి చెందిన రామాంజనేయులు అనే వ్యక్తితో తో పరిచయం అయ్యింది.  రామాంజనేయులు  పిలుపు మేరకు తన గ్రామానికి వచ్చి తాయత్తులు కట్టాలని కోరారు. గ్రామానికి వచ్చిన విష్ణువర్ధన్‌కు ఓ ఇంటిలో బస ఏర్పాటు చేశారు. తాను బస చేసిన ఇంటి యజమాని కూతురు పై విష్ణువర్ధన్‌కు  కన్ను పడింది. అంతే ఆ  ఇంటి యజమానికి ఇక్కడ గుప్తనిధులు ఉన్నాయి.. పూజ చేసి వాటిని దక్కించుకుంటే కోట్లకు పడగెత్తొచ్చు అని ఆశపెట్టాడు. అందుకు ఆ బాలిక సహాయం కావాలని అన్నాడు.

 

నమ్మిన ఆ యజమాని ఒంటరిగా బాలికను గదిలో పంపించాడు..ఇదే అదునుగా బాలికకు మయమాటలు చెప్పి పలుమార్లు అత్యాచారం చేశాడు. అయితే, లోపల అతడేవో క్షుద్రపూజలు చేస్తున్నాడన్న అనుమానంతో గ్రామస్థులు అతడిని నిలదీశారు. దీంతో బాలికపై అత్యాచారం విషయం వెలుగుచూసింది. నిందితుడిని చితకబాదిన స్థానికులు ఆ తర్వాత అతనిని పోలీసులకు అప్పగించారు. ఇలా దొంగబాబాలను నమ్మొద్దని కరోనాని ఆంక్షలు పాటించాలని పోలీసులు గ్రామస్తులకు హెచ్చరించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: