ప్రపంచ వ్యాప్తంగా కరోనాణ ఇంకా కరాళ నృత్యం చేస్తూనే ఉంది. దాదాపు అన్ని దేశాలు గత రెండు నెలలకు పైగా లాక్ డౌన్‌ కంటిన్యూ చేస్తున్నాయి. ఇప్ప‌టికే అన్ని దేశాలు కొన్ని లక్షల కోట్లు నష్టపోయాయి... కొన్ని వందల కోట్ల మంది నిరుద్యోగులు గా మారిపోయారు. ఇక సాధారణ ఉద్యోగులు ...మధ్యతరగతి కుటుంబీకుల బాధ‌లు చెప్పలేని విధంగా ఉన్నాయి. వ‌ల‌స‌ కార్మికులు కొన్ని వందల కిలోమీటర్లు నడుచుకుంటూ తమ స్వస్థలాలకు వెళ్లి పోతున్నారు. వీరు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో వలస కార్మికుల బాధ‌ల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిని ఆయా ప్రాంతాలకు తరలించేందుకు సీఎంలు జాగ్రత్తలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.

 

ఈ క్రమంలోనే వలస కార్మికులను రాష్ట్ర సరిహద్దు దాటించేంతవరకు ఏపీ సీఎం జగన్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో లో తెలంగాణ , ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, చత్తీస్గడ్ ప్రాంతాలకు చెందిన కొన్ని వేల మంది వలస కూలీలు ఉన్నారు. వీరందరినీ ఆయా రాష్ట్రాలకు పంపించేందుకు జగన్ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే వలస కార్మికులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు జగన్ అధికారులకు ప‌లు కీల‌క ఆదేశాలు జారీ చేశారు. ఓ వైపు ఉచిత బ‌స్సులు ఏర్పాటు చేయ‌డంతో పాటు.. న‌డిచి వెళుతోన్న వారికి ప్ర‌తి 5 0 కిలోమీట‌ర్ల‌కు భోజ‌నాలు ఏర్పాటు చేశారు. ఇక కొంద‌రికి రాష్ట్ర స‌రిహ‌ద్దుల వ‌ర‌కు ఉచిత బ‌స్సు స‌ర్వీసులు ఏర్పాటు చేసి వారు రాష్ట్ర స‌రిహ‌ద్దు దాటే వ‌ర‌కు ఇబ్బంది లేకుండా చేస్తున్నారు.

 

ఇదిలా ఉంటే ఈ విష‌యంలో మ‌రో తెలుగు రాష్ట్ర‌మైన తెలంగాణ కంటే కూడా జ‌గ‌న్ స్పీడ్‌గా నిర్ణ‌యాలు తీసుకోవడంతో పాటు ముందున్న‌ట్టే క‌న‌ప‌డుతోంది. అయితే క‌రోనా ఎటాక్ చేసిన ముందు టైంలో జ‌గ‌న్ కంటే చాలా స్పీడ్‌గా నిర్ణ‌యాలు తీసుకున్న కేసీఆర్ వ‌ల‌స కూలీల‌ను ఇత‌ర రాష్ట్రాల‌కు త‌ర‌లించే విష‌యంలో మాత్రం జ‌గ‌న్ తో పోలిస్తే కాస్త స్లో అయిన‌ట్టే క‌నిపిస్తోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: