లాక్ డౌన్ కారణంగా చాలామంది ఇంట్లోనే ఉంటూ వారి పనులను చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. మామూలుగా అయితే మార్చ్, ఏప్రిల్, మే నెలల్లో ఎండలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈసారి కరోనా పుణ్యమా అని అందరూ ఇళ్లకే పరిమితం కావడంతో బయట ఎండ ఎలా ఉందో అర్థం అవ్వట్లేదు. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత వస్తుందని మీకు తెలుసా...?

 

కాకపోతే ఈరోజు కరోనా సంగతి గురించి ఆలోచిస్తున్నాం తప్ప బయట పరిస్థితి ఎలా ఉందో తెలియట్లేదు. అయితే ఇక అసలు విషయానికి వస్తే.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు కురుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. దీనికి కారణం... ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న తుఫాను. అది వాయవ్య దిశలో ప్రయాణిస్తుంది. ఇక ఈ ఎంఫాన్ తుఫాను మరింత బలపడటంతో వాతావరణ శాఖ అధికారులు తెలుగు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఆదివారం నాడు ఉరుములు, ఈదురు గాలులతో అక్కడక్కడా చినుకులు పడ్డాయి. ఇకపోతే... సోమవారం, మంగళవారం కూడా వానలు పడొచ్చని ఆంధ్రప్రదేశ్ కంటే ఒడిశా, బెంగాల్ ‌పై ఎక్కువ ప్రభావం ఉండొచ్చని అంచనా వేశారు. 

 


ఇది అలాఉంటే మరోవైపు నైరుతీ రుతుపవనాలు భారత్ వైపు వస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అవి అండమాన్ నికోబార్ దీవుల్ని తాకి అవి కేరళ రాష్ట్రం వైపు రానున్నాయని సమాచారం అందుతోంది. ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను కారణంగా ఉప్పాడ సంపిలోని సముద్ర తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. ప్రస్తుతం ఉప్పాడ సముద్ర తీరం అల్ల కల్లోలంగా మారింది. ఇక ఆ ప్రదేశంలోని రంగంపేట నుంచి ఎస్పీ జీఎల్ శివారు వరకు సముద్ర అలలు ఎగిసిఎగిసి పడుతున్నాయి. దీనితో కాకినాడ, ఉప్పాడ వైపు వెళ్లేవారు చాలా ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. దీనితో సముద్రపు  అలలు మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదని వాతావరణ శాఖ అధికారులు వివరాలను తెలుపుతున్నారు. ఇలాంటి అకాల వర్షాల వలన దేశంలోని అనేకమంది రైతులు నన అవస్థలు పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: