విశాఖలో గ్యాస్ లీకేజీ ఘటన ఎంతటి నష్టాన్ని కలిగించింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎల్జి పాలిమర్స్ అనే ప్లాస్టిక్ తయారీ కంపెనీ నుంచి తెల్లవారుజామున భారీ మొత్తంలో గ్యాస్ లీకేజీ కావడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ ప్రాణాపాయ స్థితికి చేరుకున్నారు. ఈ ఘటనపై సత్వరంగా స్పందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  బాధితులకు భరోసా నిస్తూ పలు చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎల్జి పాలిమర్స్ కంపెనీ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎల్జి పాలిమర్స్ కు సంబంధించి పలు వివరాలను సేకరించేందుకు ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. 

 

 

 అంతే కాకుండా చరిత్రలో ఎక్కడా చూడని విధంగా విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనలో మరణించిన కుటుంబాలకు ఏకంగా కోటి రూపాయల పరిహారాన్ని అందించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ పరిహారం కోసం బాధిత కుటుంబాలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఏకంగా మంత్రులు స్వయంగా ఈ పరిహారాన్ని అందజేశారు. అంతే కాకుండా రెండు రోజులకు మించి  ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న వారికి లక్ష రూపాయల పరిహారం అందించారు. అక్కడి ప్రజలు ధైర్యం గా ఉండేలా మంత్రులను ఏకంగా ఆయా ప్రాంతాల్లో బస  చేయాలని ఆదేశాలు జారీ చేశారు. 

 

 

 ఇక తాజాగా విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనలోనే బాధితులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారూ  ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనలోనే బాధితులకు ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగదు  అంటూ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ మీ ఇంటి బిడ్డే  ముఖ్యమంత్రిగా ఉన్నాడని మీకు ఎక్కడ అన్యాయం జరగకుండా చూసుకుంటాను అంటూ భరోసా ఇచ్చారు ముఖ్యమంత్రి జగన్మోహన్. వాస్తవాలను తెలియజేసేందుకు ఒక కమిటీని కూడా నియమించమంటూ తెలిపారు . కంపెనీ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆ కంపెనీని  అక్కడినుంచి తరలిస్తున్నాము  అంటూ స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: