దేశంలో కరోనా ఏ రకంగా వ్యాపిస్తుందో అందరికీ తెలిసిందే. ఇప్పటికే మనుషుల మద్య దూరాలు పెరిగిపోయాయి... కరోనా వైరస్ క్షణాల్లో వ్యాప్తి చెందుతుందని.. కానీ దాని లక్షణాలు మెల్లి మెల్లిగా తెలుస్తున్నాయని.. అందుకే సాధ్యమైనంత వరకు జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఈ మద్య వివిధ రాష్ట్రాల్లో ఉన్న వలస కూలీలు తమ స్వస్థలాలకు వెళ్తున్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు ఓ మాధిరిగా ఉన్నా కరోనా కేసులు వలస కూలీలు తమ స్వస్థలాలకు వెళ్లిన తర్వాత పెరిగిపోతున్నాయి.  దాంతో ఆయా  రాష్ట్రాలు ప్రభుత్వాల వలస కూలీల విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం వస్తుంది. ఇప్పటికే కరోనా పరీక్షలు నిర్వహించి క్వారంటైన్ కి తరలిస్తున్నారు. 

 

తాజాగా మహారాష్ట్ర, గుజరాత్‌, తమిళనాడు, కేరళకు చెందిన ప్రజలు తమ రాష్ట్రంలోకి రావడానికి వీల్లేదని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. దీనికి కారణం గత కాంత కాలంగా ఈ రాష్ట్రాల్లోనే ఎక్కువ కేసులు నమోదు కావడం.. చనిపోవడం జరిగింది. అందుకే.. రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తిని నిలువరించడానికి ముఖ్యమంత్రి బీఎస్‌ యెడియూరప్ప ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31 వరకు ఇది అమల్లో ఉంటుందని ప్రకటించింది. కర్ణాటకలో ఈ నెలాఖరు వరకు ప్రతి ఆదివారం పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుందని, నిత్యావసరాలకు మాత్రమే అనుమతి ఉంటుంది వెల్లడించింది.  అయితే అక్కడి రవాణా వ్యవస్థకు మాత్రం అనుమతించింది.

 

ఇక కంటైన్‌మెంట్‌ జోన్లలో లాక్‌డౌన్‌ నిబంధనలను కఠినంగా అమలు చేస్తామన్నారు. ఇక్కడ కరోనా పూర్తి అదుపులోకి వచ్చిన తర్వాతనే నెమ్మదిగా సడలింపు చేస్తామన్నారు. అయితే  ఇతర ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు అనుమతించబడుతాయన్నారు.  అన్ని దుకాణాలు తెరువబడుతాయని సీఎం చెప్పారు. రాష్ట్ర పరిధిలో అన్ని రైళ్లు నడుస్తాయని సీఎం యోడియూరప్ప పేర్కొన్నారు. కాగా, ఇప్పటివరకు 1,100 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్‌ వల్ల రాష్ట్రంలో 30 మంది మరణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: