విజయవాడ రాజకీయాలు బాగా హాట్ హాట్‌గా నడుస్తున్నాయి. టీడీపీ-వైసీపీ నేతల మధ్య ఆరోపణల పర్వం తారస్థాయికి వెళ్లిపోతుంది. ముఖ్యంగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, టీడీపీ ఎంపీ కేశినేని నానిల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్‌లో జరుగుతుంది. విజయవాడ కార్పొరేషన్ ఎన్నిక ప్రక్రియ మొదలై, కరోనా వల్ల వాయిదా పడిన వీరి మధ్య రేగిన చిచ్చు మాత్రం ఆరడం లేదు. విజయవాడ కార్పొరేషన్‌ని సొంతం చేసుకోవాలని ఇరువురు నేతలు పోటీ పడుతున్నారు. ఇప్పటికే కేశినేని తన కుమార్తె శ్వేతని మేయర్ అభ్యర్ధిగా రంగంలోకి దింపి దూసుకెళుతున్నారు. 

 

అటు వెల్లంపల్లి కూడా టీడీపీకి ధీటుగానే ముందుకెళుతున్నారు. అయితే ఈలోపు కరోనాతో ఎన్నిక వాయిదా పడ్డాయి. అయినా సరే వీరి మధ్య విమర్శలు నడుస్తూనే ఉన్నాయి. ఇటీవల లాక్ డౌన్ ‌తో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు సాయం చేస్తున్న కేశినేనిపై కేసు పెట్టారు. దీంతో కేశినేని...వెల్లంపల్లితో సహ విజయవాడ పోలీసులపై ఫైర్ అయ్యారు. లాక్ డౌన్ నేప‌థ్యంలో పేద ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతుంటే వారికి సాయం చేస్తోన్న నాపై కేసులు పెట్టిన విజ‌య‌వాడ పోలీసుల‌కు ధ‌న్య‌వాదాలు అని తెలిపారు. ఇలాంటి కేసుల‌కు తాను భ‌య‌ప‌డ‌న‌ని కూడా నాని సెటైర్ వేశారు.

 

వెల్లంపల్లి విరాళాల పేరుతో దందాలు చేస్తున్నారని ఆరోపించారు. దీనికి వెల్లంపల్లి కూడా కౌంటర్ ఇచ్చారు. కేశినేని ట్రావెల్స్ పేరుతో చాలానే దందాలు చేశారని మండిపడ్డారు. సరే ఈ వివాదం అంతటితో ఆగలేదు. తాజాగా కేశినేని మళ్ళీ వెల్లంపల్లిపై కొన్ని ఆరోపణలు చేశారు. వ్యాపారులను బెదిరించి మరీ దండుకుంటున్నావని, దుర్గగుడి మొత్తం దోచేస్తున్నావని, వినాయకుడి గుడి నాకేస్తున్నావని, నీ దెబ్బకి విజయవాడ వణికిపోతుందని గురించి కేశినేని నాని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. అయితే విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలో పై చేయి సాధించడానికే ఈ ఇరువురు నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: