దేశంలో ఎక్కడ చూసినా కరోనా కేసులు.. మరణాలతో భీతిల్లిపోతుంది.  మరోవైపు తుఫానుతో గాలీవాన బీభత్సం సృష్టిస్తుంది.  ఈ మద్య విశాఖలో గ్యాస్ లీక్ వల్ల పన్నెండు మంది చనిపోయారు.. అందులో చిన్నారులు కూడా ఉన్నారు.  ప్రకృతి కోపానికి ఒకవైపు.. కాల సర్పంలా కరోనా కాటు మరోవైపు తో ప్రజలు అతలాకుతలం అవుతున్నారు.  మధ్యప్రదేశ్‌లో సోమవారం ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గ్వాలియన్ నగరంలో షాప్ కమ్ రెసిడెన్సియల్ కాంప్లెక్స్‌లో మంటలు చెలరేగి ఏడుగురు మృతిచెందారు.  ఈ అగ్ని ప్రమాదంలో ఏడుగురు సజీవదహనమయ్యారు. వీరిలో నలుగురు చిన్నారులు ఉన్నారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

 

గ్వాలియర్‌ పట్టణం రోషిణి ఘర్‌ రోడ్డులోని ఓ పెయింట్‌ దుకాణంలో ఉదయం ఒక్కసారిగా మంటలు లేచాయి. పెయింట్లు అంటుకొని మంటలు అన్నివైపులా విస్తరించడంతో పొరుగున ఉన్న ఇండ్లకు కూడా అగ్నికీలలు చుట్టుముట్టాయి. ఉన్నట్టుండి అగ్ని ప్రమాదం జరగడం.. అన్నివైపులా విస్తరించడంతో పొరుగున ఉన్న ఇండ్లకు కూడా అగ్నికీలలు రాజుకున్నాయి.  దాంతో అక్కడ ఉన్న ఏడుగురు సజీవ దహనం అయ్యారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారని గ్వాలియర్‌ అదనపు పోలీస్‌ సూపరింటెండెంట్‌ సత్యేంద్ర సింగ్‌ తోమర్‌ తెలిపారు. అగ్నికి ఆహుతైన దుకాణం మృతులకు చెందినదే కావడం గమనార్హం.  

 

జగ్‌మోహన్ గోయల్, జైకిషన్ గోయల్, హరిఓమ్ గోయల్ అనే ముగ్గురు అన్నదమ్ములు పెయింటింగ్ షాప్ నడుపుతున్నారని, బాధితులు కూడా వారి కుటుంబాలకు చెందిన వ్యక్తులేనని అధికారులు తెలిపారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది దాదాపు రెండు గంటల తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా, ఇంత ఘోర ప్రమాదం ఎలా జరిగిందీ..  దీనిపై కేసు నమోదుచేసి ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నామని తెలిపారు. బంధువులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: