చైనా ఇపుడు ప్రపంచానికి భయపెట్టే దేశంగానూ, ప్రాణాలు తీసే దేశంగానూ మారిపోయింది. చైనా విషయం తీసుకుంటే ఇంతకాలం ఆధిపత్యం కోసం నియంతగా శాసిస్తూ వచ్చిన దేశమనుకున్నారు. ఇపుడు బయోవార్ కి తెర తీసిన దేశంగా కూడా అనుమానిస్తున్నారు. చైనా ఎంతటి గొప్ప దేశమంటే ఆ దేశంలో చీమ చిటుక్కుమంటే కూడా ఎవరికీ తెలియదు.

 

అసలు కరోనా వైరస్ మా దేశంలోనే పుట్టలేదు అని చైనా అడ్డంగా దబాయిస్తూంటే ఎవరూ ఏమీ చేయలేకపోతున్నారు. ఇపుడు చైనాలోని వ్యూహాన్ ల్యాబ్ లో కరోనా వైరస్ పుట్టిందని అంటున్న వారి జాబితాలో అమెరికాతో పాటు అనేక దేశాలు చేరాయి. మన దేశ మంత్రి నితిన్ గడ్కరీ కూడా ఇంచు మించు ఇదే అభిప్రాయం చెప్పుకొచ్చారు.

 

ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ పైన కూడా సగం ప్రపంచం నమ్మకం కోల్పోయిందా అన్న దానికి సంకేతంగా కరోనా వైరస్ ఎలా పుట్టిందన్న దాని మీద స్వతంత్ర దర్యాప్తు ఒకటి చేయాలని 62 దేశాలు డిమాండ్ చేశాయి. అది కూడా జెనీవాలో జరిగిన హూ వార్షిక‌ సదస్సులో ఈ డిమాండ్ వచ్చింది. అంటే చైనా మీద, దానికి  వత్తాసుగా ఉన్న హూ మీద ప్రపంచ దేశాలు అనుమానపు చూపులు చూస్తున్నాయి.

 

ఇవన్నీ ఇలా ఉంటే అమెరికా ఎటూ చైనా మీద మండిపోతోంది. చూస్తూంటే పూర్తిగా  ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ కుప్ప కూలింది. యుధ్ధమైనా కూడా ఇపుడు పోయేది కూడా పెద్దగా ఏమీ లేదు. ఈ టైంలో చైనా మీద యుధ్ధం చేస్తే ఎలా ఉంటుంది అన్నది ఇపుడు అందరిలో వస్తున్న ఆలోచన. ముఖ్యంగా నెటిజన్లు ఈ రకమైన ఆలోచనలకు మద్దతు ఇస్తున్నారు.

 

ఇప్పటిదాకా చైనాను తొక్కిపెట్టే చాన్స్ భారత్ కి రాలేదు అంటున్నారు. ఇపుడు సరైన అవకాశంగా ఇది దొరికింది. జపాన్, సౌత్ కొరియాను కలుపుకుని ఏకంగా భారత్ చైనా మీదకు దండెత్తితే విజయం చేతికి  వస్తుంది. చైనా పీడ విరగడై కుక్కిన పేనులా పడి ఉంటుంది అంటున్నారు. మరి అది కుదిరే పనేనా.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: