కరోనా సంరక్షణ చర్యలను పాటిస్తూనే దశల వారీగా బస్సులను నడిపేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం సిద్ధ మవుతోంది. ఆంక్ష‌ల‌తో కూడిన ప్ర‌జార‌వాణాను ప్రారంభించేందుకు  కేంద్రం అనుమ‌తి ఇవ్వ‌డంతో సోమ‌వారం జ‌రిగిన మంత్రివ‌ర్గ బేటీలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆర్టీసీ సేవ‌ల పునః ప్రారంభానికి ప‌చ్చ‌జెండా ఊపారు. మంగ‌ళ‌వారం నుంచి ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కనున్నాయి. దాదాపుగా రెండు నెలల పాటు నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులను కరోనారహిత ప్రాంతాల్లో తొలుత తిప్పేందుకు రాష్ట్రంలోని ప్రజా రవాణా శాఖ ప్ర‌ణాళిక‌లు సిద్దం చేసింది. హైద‌రాబాద్‌లోని కంటోన్మెంట్ ప్రాంతాల్లో మిన‌హా అన్నిచోట్ల స‌ర్వీసులు కొన‌సాగుతాయ‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు ఇప్ప‌టికే వెల్ల‌డించాయ‌. 

 

అయితే తక్కువ సంఖ్యలో ప్రారంభించి పరిస్థితులకు అనుగుణంగా సర్వీసులను పెంచాలని ప్ర‌భుత్వం భావిస్తోంది. అయితే కరోనా ప్రభావంతో న‌ష్ట‌పోయిన ఆర్టీసీని గ‌ట్టెంక్కిచేందుకు చార్జీల పెంపు త‌ప్పా  ప్ర‌భుత్వానికి వేరే మార్గం క‌న‌బ‌డ‌టం లేదు. ఇప్పటికే లిక్కర్‌ ధరలు పెంచిన తెలంగాణ సర్కార్ అదే కోవ‌లో బస్‌ చార్జీలు పెంచాలని భావిస్తోంది. బ‌స్‌చార్జిల‌ను పెంచ‌డం వ‌ల‌ను అత్య‌వ‌స‌ర‌మైతే త‌ప్పా బ‌య‌ట ప్ర‌యాణించే వారి సంఖ్య గ‌ణ‌నీయంగా త‌గ్గుతుంద‌ని ప్ర‌భుత్వం యోచిస్తోంది.  50శాతం టికెట్‌ ధరలు పెంచాలని ప్రాథ‌మికంగా నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది. చార్జీలు పెంపుపై మంత్రివ‌ర్గంలో చ‌ర్చ కొన‌సాగుతోంది. 

 

ముఖ్య‌మంత్రి సాయంత్రం జ‌రిగే ప్రెస్‌మీట్‌లో చార్జీల పెంపుపై పూర్తిస్థాయిలో క్లారిటీ ఇవ్వనున్నారు. అలాగే ఆర్టీసీ బస్సులు నడిపితే బస్సు కెపాసిటీలో 50 శాతం మంది మాత్రం ప్ర‌యాణించేలా  కేంద్రం సూచించడంతో ఆ దిశగా ఆర్టీసీ అధికారులు ముందుకు సాగుతున్నారు.  అంటే 56 సీట్లు ఉన్న బస్సులో 27మందికి మించ‌కుండా చూస్తారు. అలాగే మాస్కు ధ‌రించ‌డం త‌ప్ప‌నిస‌రి చేస్తారు. ఇద్దరు కూర్చునే సీటులో ఒకరు, ముగ్గురు కూర్చునే సీటులో ఇద్దరికి మాత్ర‌మే అనుమ‌తి ఉంటుంది. 

 

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: